సమంతా , నాగ చైతన్యల విడాకుల విషయం ఎలా వైరల్ అయిందో ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడాకుల సమయంలో గోప్యత కోరుకున్న వీరు ఎవరి దారిన వారు కెరియర్ సాగలనుకున్నారూ. అయితే వీరి విడాకుల కారణం ఇది అని వారు చెప్పక పోయే సరికి , వారు ఎందుకు విడిపోయారో ఊహించి రాసే కదనాలు ఎక్కువైపోయాయి . అయితే సమంత నాగచైతన్యను దూరం చేసుకొని తీవ్ర దుఃఖం లో ఉన్నట్టు తన సన్నిహితులు తెలియ జెస్తున్నారు. ఇక నాగ చైతన్య కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్ట పడుతున్నారు అని తెలుస్తుంది.
వీరు విడిపోయాక అనేక మంది సెలబ్రిటీలు స్పందిస్తూ తమ మనసులోని మాటను పంచుకున్నారు. సమంత మాజీ లవర్ హీరో సిద్ధార్థ్ కూడా స్పందించి మోసగాళ్లకు మోసమే జరుగుతోందని తనలో ఉన్న అక్కసు బయటికి కక్కేసాడు. సమంత మేకప్ ఆర్టిస్ట్ మరియు పర్సనల్ డిజైనర్లు కూడా సమంతకు సపోర్టు గా పలు రకాల ట్వీట్లు చేశారు. మరికొంతమంది పూర్తిగా సమంతకు వ్యతిరేకమైన ట్వీట్లు కూడా చేశారు.
ఇంకా ఈ పరిస్థితుల మధ్యలో సమంత అమలాకు ఫోన్ చేసి తనకు విడిపోవాలని లేకున్నా కొన్ని అనివార్య పరిస్థితులలో విడిపోవలసి వచ్చిందని దయచేసి నన్ను క్షమించండి అంటి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటు మాట్లాడిందని సమాచారం ఒకటి బయటకు వచ్చింది. అమల గారు అమే మాటలకు స్పందిస్తూ భార్యగా విడిపోయిన మా కుటుంబానికి నువ్వు స్నేహితురాలిగా శ్రేయోభిలాషిగా ఎల్లప్పుడూ ఉంటావని జరిగిన విషయాలకు బాధ పడటం మానేసి భవిష్యత్తు పై ఫోకస్ చేయమని సూచించినట్లు తెలుస్తోంది.
ఇక సమంత నాగ చైతన్య ఎడబాటు తర్వాత మొదటి సారి కెమెరాకు పొజ్ ఇచ్చిన ఫోటో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంది.. ఆ ఫోటోలో తెల్లటి వస్త్రాల లో తల పై గులాబీల కాంబినేషన్ లో సమంత మెరిసిపోయారు.