samantha-clarifies-divorce-rumours

విడాకులకు క్లైమాక్స్ ఇచ్చినా సమంతా

News

చాలా కాలం గా సమంత నాగ చైతన్య పైన వస్తున్న విడాకుల రూమర్స్ కి త్వరలో తెర పడబోతోంది అనట్టుగ తాజాగా సమంత స్పందించారు. కానీ తను స్పందించిన తీరులో ఎలాంటి స్పష్టత లేనట్టుగా అభిమానులు గ్మనించరు.

గత కొంత కాలంగా సమంత నాగచైతన్య లు ఎన్నడూ లేనంతగా పలాన ఇండస్ట్రీ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ లో వైరల్ టాపిక్ అవుతూ ఉన్నారు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ పరిశ్రమలో వీరెందుకు విడిపోవాలని అనుకుంటున్నారో అర్దం కాక తలలు పట్టేస్కుంటున్నరు.

ఈ చూడ ముచ్చటగా ఉండే జోడి విడిపోవాలని తీసుకున్న నిర్ణయం అభిమానులకు మింగుడు పడటం లేదు. కొంత మంది ప్రేక్షకులు ఇవి వట్టి రూమర్స్ అని కొట్టి పారేసే వారు ఉన్నపటికీ . ఈ విషయం పై స్వయంగా అక్కినేని కుటుంబం స్పందిస్తే కానీ నమ్మడానికి లేదు.

గత కొంత కాలంగా సమంత నాగచైతన్య ల విడాకుల ప్రస్తావన గురించి ఎన్నో విషయాలు విన్నాం వాటిలో సమంత తీర్థ క్షేత్రాలు ఒంటరి గా వెళ్ళటం , సమంత లేకుండా నాగచైతన్య లవ్ స్టొరీ సినిమా ప్రమోషన్ చేయటం , లవ్ స్టొరీ సినిమా సక్సెస్ అయ్యాక డిన్నర్ పార్టీ లో సమంత లేక పోవటంతో , నాగార్జున బర్త్ డే కి సమంతా వెళ్ళాక పోవటం వంటి న్యూస్ ఘోరం గా వైరల్ అయ్యయి ఇవ్వన్నీ కూడా సమంతాకు అక్కినేని కుటుంబానికి ఏదో మనస్పర్థలు ఉన్నయనట్టు నమ్మేలా చేశాయి

ఇవే గాక సమంత నాగచైతన్య ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేశారని అయితే కోర్టు వీరికి మూడు నెలల కౌన్సిలింగ్ కేటాయించిందని ఈ కౌన్సిలింగ్ లో మనసు మార్చుకునే అవకాశం కలిగించిందని ప్రచారంలో ఉంది అయితే ఈ విషయం పైన సమంత ఎలాంటి స్పందన తెలుపలేదు.

అలాగే సమంతా తన భర్తను కాపాడుకుంటోంది అని ఒక రూమర్ చక్కర్లు కొట్టింది దాంట్లో భాగంగా వారిద్దరి పైన వస్తున్న రూమర్స్ కి తమ పరువు నష్టం జరగకుండా అడ్డుకట్ట వేయడానికి కోర్టును ఆశ్రయించిన టు ప్రచారంలో ఉంది.

ఇవే కాకుండా తాజాగా సమంత నాగ చైతన్య లు విడిపోవడం ఖాయమని వారిద్దరు విడిపోయాక నాగచైతన్య హైదరాబాదులో సమంతా ముంబైకి వెళ్లిపోతారని న్యూస్ కూడా వైరల్ అయింది అదే రీతిగా కొన్ని రూమర్స్ లో నాగచైతన్య సమంత విడిపోయినట్టు అక్కినేని కుటుంబం సమంతా కు ఎంత ఆస్తి పంచి ఇచ్చారో కూడా అంచనాలు వేసుకున్నారన్న విషయము ప్రచారం జరిగింది మరికొంతమంది అయితే ఈ విస్తృత ప్రచారం వల్ల సమంత నాగ చైతన్య లు విడిపోయారని అని కూడా నమ్మెసారు.

అయితే తాజాగా సమంత నిర్వహిస్తున్న తన సొంత దుస్తుల బ్రాండ్ సాకి ప్రారంభించి సంవత్సరం అవుతుండటంతో మంగళవారం రోజు పార్టీ అరేంజ్ చేస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్టు ద్వారా తమపైన వస్తున్న రూమర్స్ కి ఏదో క్లారిటీ సమంత ఇవ్వబోతున్నాదని చాలామంది అభిమానులు ఆ ఫంక్షన్ కి హాజరయ్యారు, హాజరైన ప్రతి అభిమానికి సమంత నాగ చైతన్య లు ఎందుకు విడిపోతున్నారు తెలుసుకోవాలని ఉత్కంఠ నెలకొంది.

samantha-clarifies-divorce-rumours
samantha clarifies divorce rumours

ఆమెతో ముచ్చటించిన ప్రతి అభిమాని కూడా ఆమెని ఒకే ప్రశ్న అడగడం జరిగింది అది మీరు నాగచైతన్య ఎందుకు విడిపోతున్నారు అని.

ఒక అభిమాని అయితే ధైర్యం గా మీరు నాగచైతన్య విడిపోతున్నారు అట కదా విడిపోయాక మీరు ముంబైకి నాగ చైతన్య హైదరాబాద్ కి పరిమితమై ఉండబోతున్నారు అట కదా అని అడిగేశాడు దానికి సమాధానం గా సమంత హైదరాబాద్ నాకు ఇల్లు లాంటిది హైదరాబాద్ నాకెంతో ఇచ్చింది నేను హైదరాబాద్ ని విడిచి వెళ్ళేది లేదని అని ఖచ్చితంగా చెప్పేసింది. అయితే ఇంతటి సెలబ్రేషన్ ఈవెంట్ లో నాగచైతన్య గాని అక్కినేని కుటుంబం వారు కానీ లేకపోవడంతో సమంత ఇంకా ఏదో దాచేస్తుంది అని ప్రజలలో అనుమానానికి తావు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *