samantha-deleted-naga-chaitanya-photos

తన ఇంస్టాగ్రామ్ ఐడి నుండి నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేసిన సమంత. ఎన్ని ఫోటోలు తొలగించింది అంటే…

News

సమంత తన ఇంస్టాగ్రామ్ ఐడి లో నాగచైతన్య తో కలిసి దిగిన ఫోటోలు అన్నిటిని డిలీట్ చేసింది. అక్టోబర్ రెండవ తారీకున అధికారికంగా తమ విడాకులను సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన సమంత నాగ చైతన్య లు. తమ బంధానికి స్వస్తి చెప్పి ఇకపై మిత్రులుగా ఉండబోతామని తెలియజేశారు..

ఈ విడాకుల తంతు ఇద్దరి విషయంలో ఎంతో బాధ కలిగించింది. ముఖ్యంగా సమంతకు భర్తను దూరం చేసుకున్న భార్యగా మరియు ఆమె పై వస్తున్న వదంతుల వల్ల దుఃఖంలో మునిగి పోయింది, ఇక ఆ వదంతులను కొట్టిపారేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేక కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఈ కేసు కొనసాగుతున్నప్పటికీ ఇదే సమయంలో మనశ్శాంతి కోసం సమంత హిమాలయాలకు ఆధ్యాత్మిక పర్యటన చేసింది, తాజాగా తన పర్యటన పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన ఆమె వెంటనే దుబాయ్ కి ప్రయాణమైంది, ఇక దుబాయిలో తన మనసుకు నచ్చినట్టు ఆహ్లాదకరంగా రకరకాలైన పనులు చేస్తూ తన మనసును ప్రశాంత పరచుకునే ప్రయత్నం చేస్తు ఉంది. తన దుబాయ్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ఐడి లో షేర్ చేసుకోగా అవి చూసిన అభిమానులు మళ్లీ పాత సమంతాను చూస్తున్నాం అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

samantha-deleted-naga-chaitanya-photos

ఇక దుబాయ్ ట్రిప్ లో ఉండగా తన ఇంస్టాగ్రామ్ ఐడి నుండి నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలను ఒక్కొక్కటిగా డిలీట్ చేసింది. గతంలో సమంత నాగ చైతన్య లు యూరప్ ట్రిప్ లో ఉండగా దిగిన ప్రతి ఫోటోను ఆమె డిలీట్ చేసింది, దీన్ని బట్టి ఆమె నాగ చైతన్య జ్ఞాపకాల నుండి దూరం కావాలని ప్రయత్నం చేస్తోందని అర్థమవుతోంది.
ఆమె 28వ తేదీ ఉదయం నుండి నాగచైతన్య తో గత ఐదేళ్లుగా కలిసి ఉండి పోస్ట్ చేసిన ఫోటోలన్నీటిని డిలీట్ చేసింది. ఆమె ఫోటోలను తొలగించిన సంగతి మధ్యాహ్నం అయ్యేవరక ఎవరికీ తేలియా లేకపోయింది. ఇక ఆమె అకౌంట్ ను పరిశీలించిన నెటిజనులు సమంత అన్ని ఫోటోలు డిలీట్ చేయలేదని కనుగొన్నారు. నాగార్జున గారితో దిగిన ఫోటోలు మరియు ఇతర మిత్రులతో నాగచైతన్య కలిసి ఉన్న ఫోటోలను ఆమె డిలీట్ చేయలేదు, కేవలము నాగ చైతన్య మరియు సమంత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే ఆమె డిలీట్ చేసిందని కన్ఫామ్ చేసుకున్నారు.

ఆమె ఎందుకు డిలీట్ చేసిందంటే తమ విడాకుల ప్రకటనలో, సమంత మరియు నాగ చైతన్య తమ దశాబ్దాల స్నేహాన్ని ఎంతో ఆదరిస్తారని వెల్లడించారు. అందుకే తమ కామన్ ఫ్రెండ్స్‌తో పాటు నాగ చైతన్య ఉన్న పోస్ట్‌లను తీసెయ్యా లేదు. మరియు ఆమె నాగ చైతన్య తండ్రి నాగార్జున మరియు అఖిల్ అక్కినేనితో ఉన్న పోస్ట్‌లను తీసివేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *