ఇటీవల నాగచైతన్యతో సమంతా విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుండి సమంతా సినిమాలకి కాస్తంత బ్రేక్ ఇచ్చినట్టే కనపడుతోంది. తన సన్నిహితురాలు అయిన శిల్పారెడ్డి తో కలిసి ఇటీవల వరుసగా పుణ్యక్షేత్రాలను సంధర్శించే పనిలో బిజీగా ఉంటోంది. చైతుతో విడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత సమంతా ఏ పని మీద కూడా మనసు సరిగ్గా పెట్టలేకపోతోందిట.
ఇంతకుముందు సమంతా లొకేషన్ లో ఉందంటే సందడే సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు చేస్తోన్న ఒకటీ ఆరా షూటింగ్స్ లో కూడా సమంతా చాలా ముభావంగా ఉంటోందని సమాచారం. తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని సినిమాల షూట్ కి అటెండ్ అవుతున్న సమంతా, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా, ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా సెట్ లో ఒంటరిగా ఉంటోంది. సమంతా లోని ఈ మార్పుని గమనించిన వారు సమంతా లో చాలా మార్పు వచ్చిందని అనుకుంటున్నారు.
అయితే నాగచైతన్యతో సమంతాది పదేళ్ళ ప్రేమ బంధం, అలాగే వీరిది నాలుగేళ్ల వైవాహిక బంధం. ఒక్కసారిగా ఈ బంధం పెటాకులు కావడంతో కాస్తంత డిప్రెషన్ లోకి సమంతా చేరుకుందట. అందువల్ల సమంతా తన మనసు సరిగ్గా లేకపోవడంతో మనశ్శాంతి కోసం గుళ్ళు,గోపురాలు అంటూ తిరుగుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఒక్క సినిమాకి దాదాపు మూడు కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకునే సమంతా, వీలు అయినంత వరకూ ప్రస్తుతం షూటింగ్ ఏవీ లేకుండా ప్లాన్ చేస్తోందిట. ఈ విషయములో దర్శకులు కూడా సమంతా చెప్పినట్టే నడుచుకుంటున్నారు. అయితే ఇటీవల సమంతా ఫొటోల్లో కనిపిస్తున్న దాని ప్రకారం సమంతా మొహంలో మునపటి కళ కోల్పోయి, దిగులుగా కనపడుతోంది. అందుకోసమే సన్నిహితుల సలహా మేరకు తీర్ధయాత్రకు చేస్తోంది.
జీవితములో ఎంతటివారికి అయినా కష్ట,సుఖాలు కామన్. అలాగే ఎంతో మంచి మనసున్న సమంతా జీవితములో చీకట్లు తొలగి మళ్ళీ మునుపటి సమంతా లాగా చూడాలని ఆమె అభిమానులు,సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. అయితే సమంతా ప్రస్తుతం గుణశేఖర్ సినిమా “శాకుంతలం” లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే నయనతార ప్రొడక్షన్ హౌస్ లో కూడా ఒక సినిమా చేయడానికి ఇంతకుముందే సైన్ చేశారు. డ్రీమ్ వారియార్ సినిమా చేయడానికి కూడా కొంతకాలం క్రితం సమంతా అడ్వాన్స్ తీసుకున్నారట.