సమంత: ‘నీ ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ సమంతా..!

Movie News

సమంత: ‘నీ ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ సమంతా..!

నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత సమంత గతంలో కన్నా ఇప్పుడు ఇంకెక్కువ దూకుడు పెంచి తమిళ్, తెలుగు మరియు హిందీ సినిమా ఇండస్ట్రీలల్లో రచ్చ చేస్తోంది. అంతే కాదు తాజా గా విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీలో ‘ఊ అంటావా మావా’ అనే ఐటం సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ పాటకు సమంతా ఏకంగా 50 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. అంతే కాదు ప్రస్తుతాం సమంతా తమిళ్, తెలుగు లతో పాటుగా హిందీ లోను వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఆమె ఇంకో సినిమాకు సైన్ చేసింది. సమంత మైన్ రోల్ లో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ డైరెక్షన్ చేస్తున్న ‘యశోద’ అనే చిత్రంలో నటించడానికి సామ్ ఓకే చెప్పింది.

ఇక సమంతా సినిమాల కంటే కూడా ఎక్కువగా ఆమె నాగ చైతన్య తో విడాకుల సంఘటనే సోషల్ మీడియా లో ట్రోలింగ్ కి గురి అవుతుంది. ‘సమంత ఐటం సాంగ్ కి కేవలం 50 లక్షలు మాత్రమే వాసులు చేసిన కూడా ఆమే నాగ చైతన్య తో విడాకుల రూపంలో 50 కోట్లవరకు టాక్స్ కట్టని డబ్బును కొట్టేసిందంటూ’ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు అంతే ధీటుగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది సమంతా. ‘Kamarali Dukandar God bless your soul.’ అని కామెంట్ పెట్టింది. దానికి అర్ధం దేవుడు ని ఆత్మకు శాంతి చేకూర్చాలని. మొదట్లో తనపై వస్తున్న కామెంట్స్ పై ఎక్కువ స్పందించని సమంతా ఇప్పుడు మాత్రం తన రూట్ మార్చినట్టు కనిపిస్తుంది. ‘ఫామిలీ మాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా జాతియా స్థాయి లో మంచి గుర్తింపును సంపాదించుకుంది సమంతా.ఈ వెబ్ సిరీస్ కారణంగా ఆమేకి మరిన్ని అవకాశాలు జాతియా స్థాయిలో మొదలయ్యాయి, కాబట్టి మరింత బిజీ గా మారిపోయింది సమంతా.

తెలుగు, తమిళ సినిమాల్లో చేసిన పాత్రలకు పూర్తి డిఫరెంట్ పాత్రను ఈ వెబ్ సిరీస్ లో పోషించింది.దాంతో సమంత రేంజ్ ఏంటో అందరికి అర్ధం అయ్యింది. కాబట్టి ఆమేకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు హిందీ లోను రూపొందిస్తున్నారు. సమంత స్టామినా మరోసారి భారత దేశ ప్రేక్షకులకు కనువిందు కానుంది.

మరోవైపు సమంత, నయనతార, విజయ్ సేతుపతితో ఒక మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ కి బాలీవుడ్ లెజెండ్ హీరో షారుఖ్ ఖాన్‌ తో, అంట్లీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లోసం మొదట్లో నయనతారను హీరోయిన్ గా అనుకున్నా.. ఫైనల్‌గా సమంతను ఈ మూవీలో కథానాయికగా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియన్సు కి చేరువైన సమంత.. ఈ చిత్రంతో డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయమై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వెలుబడాల్సి ఉంది. ఈ మూవీకి ‘లయన్’ అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ప్రియమణి ఆక్ట్ చేస్తోంది. ఈ చిత్రం కోసం సామ్ కు రూ. 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *