గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న నాగచైతన్య సమంతల విడాకుల విషయం రోజు రోజుకి ఏదో ఒక పరిణామాన్ని రుచి చూస్తూ ఉంది. ఎంతోకాలంగా గోప్యంగా ఉంచి ఒక్కసారిగా నాగచైతన్య సమంతా లు ఇద్దరూ తాము విడిపోతున్నట్లు తెలియజేయడంతో ప్రజలలో ఒక రకమైనటువంటి బాధతో పాటు వీరి విడాకులకు గల కారణాలు ఏమిటి అని తెలుసుకునే ఉత్కంఠ ప్రజలలో చెలరేగింది.
అయితే కొంతమంది సమంత వ్యక్తిగత మరియు వైవాహిక జీవితం పైన కొన్ని అవాస్తవమైన కథనాలు రాసి తనకెంతో మనోవేదనకు గురి చేసినట్టు గత కాలంగా ఎన్నో పోస్టుల ద్వారా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు, ఆ రకంగా వచ్చిన పుకార్లు తనని ఎంతో కృంగదీసాయి అని కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి కూడా చూశాము. అయితే వస్తున్న పుకార్లన్ని సమంతా పైనే అయి ఉండడం మూలంగా తను భరించలేని ఒక భారము తన పైన ఉన్నట్టుగా సమంత భావించి ఎన్నోసార్లు ఈ రకమైనటువంటి పుకార్లకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేసింది అయినప్పటికీ పుకార్లు రాసేవారు రాస్తూనే ఉన్నారు కథనాలు వస్తూనే.
ఇక ఈ విడాకుల అంశంపై నుండి బయట పడాలి అని ఆలోచించి ఏ చిత్ర పరిశ్రమ నుండి ఆఫర్ వచ్చినా కాదనకుండా ఒప్పేసుకుంటున్నారు. గతంలో తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ కు సీక్వెల్గా ఫ్యామిలీ మెన్ 2 రాబోతుండగా సమంత పైన వస్తున్న పుకార్లు వల్ల తన కెరియర్ పైగా తాను దృష్టి సారించన లేకపోతోంది.

తన పైన వచ్చిన పుకార్లే తన కెరియర్ పైన ఫోకస్ చేయకపోవడానికి కారణమని క్లియర్ కట్ గా ఆమె తెలియజేసింది . ఇక ఆమెను అత్యంత బాధ కలిగించిన విషయం తనకు పిల్లలు కనడం ఇష్టం లేదని అందుకే ఎన్నోసార్లు అబార్షన్ చేయించుకుంది అని అందుకే విడాకులు తీసుకున్నదని వచ్చిన పుకారు ఒకటైతే మరొకటి తనకు ఎన్నో ఎఫైర్ లు ఉన్నాయని వెంకట్రావు అనే న్యాయవాది ఆరోపించడం తో తనను అగాధంలో తోసి వేసినట్టు ఆమె ఫీల్ అయింది.
ఇక సమంత కొంతకాలం సినిమాలనుండి బ్రేక్ తీసుకుని వీటిపై పోరాడాలని నిర్ణయించుకొన్నారు ఇలా తన పై పుకార్లు పుట్టిస్తున్నారు సదరు యూట్యూబ్ ఛానల్ ల పైన కఠినంగా ప్రవర్తించింది. తనపై ముఖ్యంగా అవాస్తవాలను ఆరోపించిన sumantv పై మరియు కొన్ని ఛానళ్ల పై కఠినంగా ప్రవర్తిస్తూ ఆ చానల్ లో తనపై అవాస్తవాలు పలికిన ప్రముఖులను వదలకుండా అందరి పేర్లను జతచేసి , తన పరువు నష్ట పరిచారని కోర్టుకు సమర్పించింది, ఇక సమంత విజ్ఞప్తిని అందుకున్న కోర్టు ఆ సదరు ఛానళ్లకు అధికారికంగా నోటిఫికేషన్లు పంపింది.