samantha-fires-on-media-at-tirumala

కాస్తాయిన బుద్ధి ఉందా అంటూ మీడియా పైన కోపించిన అక్కినేని సమంత…

News

గ‌త కొద్ది రోజులుగా కింగ్ నాగార్జున హారి కోడలు అయిన అక్కినేని స‌మంత ఎక్క‌డికి వెళ్లిన భర్తను గాని మామను గాని లేదా కుటుంబ సభ్యులను గాని తీసుకెళ్లకుండా తాను ఒక్కత్తే మాత్రమే వెళుతుంది. సమంత నాగ చైతన్య దాంపత్య జీవితం గురించి ఎన్ని పుకార్లు వచ్చినా కూడా వాటిపై ఆవిడ ఎంతమాత్రం స్పందించకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. ఇటీవల సమంత గారు తిర‌మలకి తన బాడీ గార్డ్స్ ను తీసుకొని వెళ్ళింది, అక్క‌డ శ్రీనివాసున్ని ద‌ర్శించుకుంది. విఐపిల కోసం ఇచ్చే బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు సమంత.

దర్శనం అయ్యాక రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చదువుతుండగా..
అయితే తిరుమల ఆలయ అధికారులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వస్త్రంతో సత్కరించిన తరువాత శ్రీవారి తీర్థ ప్రసాదములను అందజేశారు. ఆ సమయంలో మీడియావారు హీరోయిన్ సమంతను ఓ ఫొటో తీసుకుంటామని రిక్వెస్ట్ చేశారు.కానీ ఆవిడ వారిని పాటించుకోకుండా వెళ్తూవుంటే మీడియా వారు మేడమ్ మేడమ్ వన్ ఫోటో ఫోటో అంటూ మీద మీద పడుతూవుంటే సమంత బాడీ గార్డ్స్ వారిని నివారిస్తూ వచ్చారు, అయిన కూడా మీడియా వారు అదే విధం గా విసికించటంతో దానికి ఆమె ‘గుడికి వచ్చి ఇక్కడ కూడా ఇదేం పద్ధతి.. బుద్ధుందా మీకు?’.. అంటూ ఆవిడ
సమాధానమిచ్చారు.

samantha-fires-on-media-at-tirumala
samantha fires on media at tirumala

అలాగే సమత గారు చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన, శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని కూడా దర్శించుకున్నారు. మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజలో పాల్గొన్నరూ ఆమె, ఆ తర్వాత స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్నారు సమంత. ఆ తరువాత ఆలయం తరపున వేద పండితులు అక్కడ మంత్రోఛ్చరణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను, మరియు
జ్ఞాపికలను ఆమెకు అందజేశారు. అయితే అక్కినేని సమంత గారు ఒక్కరే దైవ దర్శనానికి వెళ్ళడం వల్ల అక్కడ ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది. దంతో పాటు సమంత తన భర్త అయిన నాగ చైతన్య తో కాకుండా ఒక్కరే ఇలా దర్శనానికి రావటం నెటీజనులకు మరింత అనుమానాన్ని కలిగిస్తుంది. మొన్న నాగ చైతన్య సాయి పల్లవి నటిస్తున్న లవ్ స్టార్ సినిమ ట్రైలర్ రిలీస్ అయిన నేపథ్యంలో సమంత తనకు సంతోషం గా ఉందంటూ ట్వీట్ చేశారు, దానికి నాగ చైతన్య కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రీ ట్వీట్ చేశారు దాంతో అప్పటి దాకా వచ్చిన అనుమానాలకు చెక్ పెట్టినట్టు అయింది.

హీరోయిన్ సమంత పనిచేసినటువంటి తరువాతి ప్రాజెక్ట్ ‘శాకుంతలం’ సినిమా ఈ మధ్యే షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే తమిల్ లో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ మూవీలో నటిస్తున్నారని ప్రకటించారు. తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంతో తెరకెక్కితున్న ఈ మూవీలో హీరో గా విజయ్‌ సేతుపతి, మరియు నయన తారలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *