భారతదేశంలో పేరు పొందిన టీవీ కార్యక్రమాలలో ఒకటి కొన్ బనేగా కరోడ్పతి. హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసి ఇతర బాషల్లో కూడా ఈ షో ప్రసారం అవుతోంది. తెలుగు భాషలో మంచి ఆదరణ పొందిన ఈ షో ఐదవ సీజన్ గా జెమినీ టీవీలో సోమవారం నుంచి గురువారం వరకు ప్రసారం అవుతోంది. మొదటి మూడు సీజన్లు నాగార్జున హోస్ట్ గా ఉండగా నాలుగో సీజన్ లో చిరంజీవి గారు,ఇప్పుడు ఐదవ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ గా చేస్తున్నారు.
వీరందరూ కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు మరియు హోదా కలిగినటువంటి వాళ్ళు, గతంలో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 లో తన ప్రతిభను బయటపెట్టి ప్రజల ఆదరణను సొంతం చేసుకున్నాడు, బిగ్ బాస్ సీజన్ 1 లో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్ర కనిపించాడు.

ఆ షో లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం పోస్ట్ చేస్తుండగా ప్రేక్షకులలో షో పైన మంచి ఆసక్తి కనుపరుస్తున్నారు.
అయితే ఈ గేమ్ షో లో తాజాగా నవరాత్రి స్పెషల్ విత్ సమంత అనే ప్రోమోను విడుదల చేసింది. ఆ ప్రోమో ప్రారంభంలో ఎన్టీఆర్ గారు సమంతను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత సమంత స్వీట్ పైన భయమేస్తోంది అని అన్నారు , అలాగే ఉంటుంది అది హాట్ సెట్ కాబట్టి అని తనదైన స్థాయిలో ఎన్టీఆర్ బదులిచ్చాడు.
ఆ తర్వాత షోనీ రివర్స్ గా కోటి నుంచి వెయ్యి వరకు ఆడండి అంటూ ఎన్టీఆర్ అన్నట్టు చూస్తాము, దానికి సమంత నాకు డబ్బు అవసరం లేదు అంటూ బదులిస్తోంది. మరికొంతసేపటికి కావాలి అంటూ మాట మార్చినట్టు కనిపిస్తోంది, ఇక చివరగా క్విట్ అయిపోతారా అని ఎన్టీఆర్ అనగా ఈ మాట ఇప్పుడు అంటున్నారు ఏంటి ముందే చెప్పాలి కదా, అని కొంచెం సీరియస్ ఫేస్ తో అనడం కనిపిస్తోంది.
అయితే ఈ లాస్ట్ డైలాగ్ ప్రోమో కి హైలెట్ గా నిలిచింది. మరియు ఆ షో లో ఏం జరగబోతుందో, సమంత తన విడాకుల గురించి ఏమైనా ప్రస్తావిస్తారు అని తెలుసుకోవాలి అనే ఉత్కంఠ ప్రేక్షకులలో నెలకొంది. సమంత అలరించిన ఈ ఎపిసోడ్ నవరాత్రుల స్పెషల్ ఎడిషన్ గా ప్రసారంకానున్నది.