samantha-marriage-post

విడాకుల పై సమంత స్త్రీలను ఉద్దేశించి చేసిన పోస్ట్ వైరల్

News

గత అక్టోబర్ రెండవ తారీకున సమంత మరియు నాగచైతన్యలు విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు, ఆ తర్వాత సమంత ఎదుర్కొన్న మనోవేదనను ఎన్నో పోస్టులు వీడియోల ద్వారా చూశాము అదే సమయంలో తనపై రకరకాలైన అబాండాలు కూడా ఆమె భరించడం చూశాము, ఆమె తనపై వస్తున్న అవాస్తవాలతో పోరాడడానికి కొంతకాలం సినిమాలను దూరం పెట్టి పుకార్లకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంగా కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో తన జీవితంలో జరిగిన ఒడిదుడుకుల నుండి బయటపడడానికి తన మనసును ఆధ్యాత్మిక వైపు మరల్చుకుంది. ఇందుకొరకు ఆమె తన సన్నిహితులతో హిమాలయాలకు పయనం అయింది అక్కడ తను చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత మొదటిగా తన పైన వస్తున్న అబండాల విషయమై కోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు సానుకూలమైన తీర్పు వెలువడనందున తిరిగి మరో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.

samantha-marriage-post

ఇక పరిస్థితి ఇలా ఉండగా సమంతా తాజాగా ఒక పోస్టును ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో భారత హాకీ టీం క్యాప్టెన్ అయిన రాణీ రామ్ పాల్ గారు చేసిన పోస్టును సమంత ఇప్పుడు షేర్ చేసింది, ఆ పోస్టులో మహిళలను ఉద్దేశించి స్పూర్తి నింపే బలమైన వాక్యాలు ఉండడం సమంత జీవితానికి అవి కరెక్ట్ గా సూట్ అవ్వడం వల్ల ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది.

సమంత షేర్ చేసిన ఆ పోస్టులో మీకి అమ్మాయి పుడితే వారి పెళ్లి గురించి ఆలోచించడానికి బదులుగా ఆమెను విద్యారంగంలో ప్రోత్సహించండి, అమ్మాయిలకు మంచి విద్య గుణాలు నేర్పండి, ఆమె పెళ్లి కోసం దాచే ధనాన్ని ఆమెలో ధైర్యాన్ని నింపడానికి ఖర్చు చేయండి ఆమెలో ఆత్మవిశ్వాసం నింపండి ఆమెను డబ్బు విషయంలో స్వతంత్రులుగా పెంచండి, ఆమెలో తనను తాను ప్రేమించుకునే గుణాలను నింపండి, ఆమెను ఒక యోగ్యురాలు గా చేసి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అని భయపడకుండా ఉండే ఒక మంచి అమ్మాయిని తయారు చేయండి.
అవసరం వస్తే ఆమెపై దురుసుగా ప్రవర్తించే వారిని ఎవరినైనా చాచి కొట్టే అంతా ధైర్యాన్ని ఆమెలో నింపండి అని ఉన్న పోస్ట్ ను సమంత ఇప్పుడు షేర్ చేయగా ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక సమంత చార్ధామ్ యాత్ర నుండి వచ్చి కోర్టు కు హాజరైన తర్వాత మరొక ఆధ్యాత్మిక యాత్రకు తన స్నేహితురాలు శిల్పా రెడ్డి తో బయలుదేరింది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత ఇది ఆమె రెండవ ఆధ్యాత్మిక పర్యటన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *