Naga Chaitany Samantha

నాగచైతన్య కొరకు సమంత మిగిల్చిన తీపి జ్ఞాపకం ఇదే!

News

సుమారు మూడు నెలలుగా ఏ టీవీ ఛానల్ లో అయినా సోషల్ మీడియాలో అయినా హీటెక్కించిన విషయం ఏదైనా ఉంది అంటే అది సమంత నాగ చైతన్య విడాకుల విషయమే, ఇది కేవలం మన తెలుగు చిత్ర పరిశ్రమనే కాకుండా పూర్తి భారతదేశంలో ఉన్న అభిమానులను సైతం కదిలించింది, ఎంతోమందికి రోల్ మోడల్ గా ఉన్న బ్యూటిఫుల్ జోడి విడిపోవడం చాలా మందికి మింగుడుపడని వార్తగా మారింది.

సుమారు పది సంవత్సరాలుగా ప్రేమించుకొని పెద్దలు అంగీకరించే ఎంత వరకు ఎదురు చూసి మరి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి జోడి ఎక్కడ కనిపించినా ఏ సినిమాలో కనిపించిన ఏ అడ్వటైజ్మెంట్ లో కనిపించిన ప్రేక్షకుల మనసుకు అదొక కన్నుల పండుగగా అనిపించే వారు నాగచైతన్య సమంత, అయితే సుమారు మూడు నెలల నుండి వీరు విడిపోతున్నారు అనే విషయము ప్రతి టీవీ ఛానల్లో ప్రసారం అవుతూనే ఉండేసరికి ప్రజలందరూ ఇదంతా పుకారే అని అనుకున్నారు కానీ ఆలోపే ఈ అందమైన జోడి మేము నిజంగానే విడిపోతున్నానంటూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు, అయితే ప్రేక్షకులలో ఇంత అందంగా ఉన్న జోడి , సినీ పరిశ్రమలో విజయవంతంగా రాణిస్తున్న ఈ జోడి విడిపోవడానికి కారణాలు ఏంటి అనే తికమకలో పడ్డారు.

Naga Chaitany Samantha
Naga Chaitany Samantha

ప్రేక్షకులలో కలిగిన కన్ఫ్యూజన్ పోగొట్టేందుకు అటు సమంత కానీ ఇటు నాగచైతన్య గాని ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తద్వారా ప్రేక్షకులే వారు విడిపోవడానికి కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు . ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్నోరకాల అయినటువంటి పుకార్లు పుట్టుకొచ్చాయి, అయితే కొన్ని విషయాల పైన సమంత స్పందిస్తూ ఆ పుకార్లను ఆపే ప్రయత్నం చేశారు, అయితే ఆమె సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె తన భర్తకు దూరమై ఎంతో మనో వేదన చెందుతుంది దయచేసి ఈ సమయంలో ఆమెను ఈ రకంగా వెంటాడటం మానేయండి అంటూ వేడుకున్నట్లుగా చూస్తున్నాం, తాజాగా ఒక షూటింగ్ లో సమంత నాగచైతన్య జ్ఞాపకం చేసుకుని ఏడ్చినట్టు మనము వార్తలొచ్చాయి, సమంతా ను గురించి ఆలోచిస్తే తను నాగచైతన్యకు దూరమై ఎంతో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది.

ఇక ఇదే రీతిగా నాగచైతన్య కూడా సమంతా కు దూరమై తర్వాత తన మనస్సు కూడా కొంతమటుకు కలత చెందింది అందుకే తాను ప్రస్తుత కాలంలో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్న టు కనిపిస్తున్నాడు, ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఒక ఖరీదైన భవనంలో ఒక ఫ్లాట్ కొన్నట్టు ఈ మధ్యలో కొన్ని వార్తల బయటికి వచ్చాయి, అయితే మరో వాదన ప్రకారం ఈ ప్లాటు సమంత మరియు నాగ చైతన్య లు సంవత్సరం కిందటే ఆ ఫ్లాట్ లోనే జీవించాలని అని ఎంతో ఇష్టంగా కొన్నారని అని అందుకొరకు సమంతాకు నచ్చినట్టుగా ఆ ఇంటిలో మరమ్మతు పనులు కూడా చేయించారు అనే వార్త కూడా ఒకటి బయటికి వచ్చింది. ఇక ఆ మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి త్వరలోనే నాగ చైతన్య ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేసి ఒంటరిగా ఉండబోతున్నాట్టు తెలుస్తుంది బహుశా సమంతా తనతో గడిపిన ఆ కొద్ది కాల జ్ఞాపకాలను ఈ ఫ్లాట్ లో ఉండి అలా ఆస్వాదించాలనే ఆలోచనతో నాగచైతన్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.