మోస్ట్ బ్యూటిఫుల్ జోడి గా గుర్తింపు సంపాదించుకున్న నాగ చైతన్య సమంతాలు ఎవరూ ఊహించని రీతిలో హఠాత్తుగా విడిపోవడం ప్రజలలో కొంత కలతను తీసుకుని వచ్చింది. కారణాలు ఏమైనప్పటికీ కలిసి బతకలేని తరుణంలో సుదీర్ఘమైన నిర్ణయంతో విడిపోయిన నాగచైతన్య సమంతా లు ఇప్పుడు విడివిడిగా తమ తమ కెరియర్ లో బిజీ గా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అయితే వారు విడిపోతూ ఎందుకు విడిపోతున్నారో సరైన క్లారిటీ ప్రజలకు ఇవ్వక పోయేసరికి ప్రజలలో వాళ్ళ విడాకుల కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉత్కంఠ నెలకొంది. తద్వారా కొంతమంది విడాకులకు ఫలానా కారణం అంటూ రకరకాల పుకార్లు ఆల్లేశారు.
అయితే పుకార్లు రాసేవారు నాగచైతన్య గతము నుండే ఎలాంటి వివాదాలు లేకపోయే సరికి ప్రతి నింద సమంత పైన వేస్తూ పుకార్లు రాయడం ప్రారంభించారు.
పుకార్లు రాసేవారు ముఖ్యంగా సమంత క్యారెక్టర్ ని బ్యాడ్ గా చూపించాలని ఉద్దేశంతో సమంతాదే తప్పు అన్నట్టుగా చూపిస్తూ రకరకాల వ్యక్తులతో ఆమెకు అఫైర్ లు ఉన్నాయి అంటూ కథనాలు రాశారు. దీంతో ఆమె వ్యక్తిగతంగా ఎంతో మనోవేదన చెందింది, ముఖ్యంగా తనకు అత్యంత బాధ కలిగించిన విషయం ఆమె పర్సనల్ డిజైనర్ అయినటువంటి ప్రీతంకు ఆమెకు ఏదో ఉందంటూ ఆపాదించి రాసిన కథనాలు ఆమెను కృంగదీశాయి.
గతంలో ప్రీతం పైన కాళ్ళు పెట్టుకుని పడుకున్నా ఫోటోను సమంత షేర్ చేయగా ఆ ఫోటోను వాడుకొని రకరకాల కథనాలు అల్లుతూ ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారు. అదేగాక సమంతాకి పలుమార్లు ప్రీతం ఐ లవ్ యు అని చెప్పిన విషయం కూడా తెర పైకి లాగారు . ప్రీతం దానికి వివరన ఇస్తూ సమంతను నేను ఎల్లప్పుడూ సహోదరి గానే భావిస్తాను అని అన్నపటికి . వారి పైన కధనాలు రావడం మాత్రం ఆగడం లేదు.
ప్రస్తుతము వస్తున్నటువంటి భయంకరమైన రూమర్స్ మధ్యలో శ్రీ రెడ్డి కూడా స్పందిస్తూ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టింది. బాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా పేరున్నవారే తమ దాంపత్య జీవితానికి విలువనిస్తూ కెరియర్కు దూరమయ్యారు కానీ సమంత మాత్రం తన భర్త ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సినిమాలు చేస్తూ ఉంది , ఒక హైటు లేదు, కలరు ఉండదు కేవలం తాను క్యూట్ గా ఉంటుంది , వివాహాల్లో గెస్టు లను ఇన్వైట్ చేసే అమ్మాయి గా పని చేసిన సమంత.
అతి చిన్న స్థాయి నుండి పైకెదిగి ఇండస్ట్రీలోనే గొప్పింటి కోడలు అయింది, అయితే తన అత్తింటివారి ఇచ్చే స్వాతంత్రాన్ని వినియోగించుకొని తన అత్తింటి గౌరవాన్ని కాపాడే దాన్ని గా ఉండకుండా, సినిమాలు చేయడం డబ్బు పట్ల వ్యామోహం పొందడం జరిగింది. ఇక నాగచైతన్య కు విడాకులు ఇచ్చిందంటే బంగారు బాతు కోసేసి నట్టే తన కెరియర్ ను తానే చేజేతులా నాశనం చేస్తుంది అని మాత్రం చెప్పగలను శ్రీ రెడ్డి అన్నారు.
అదే రీతిగా అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ప్రస్తావిస్తూ అవి ఎవరి వైపు ఉన్నాయి నాకు తెలియదు కానీ నిప్పు లేకుండా మాత్రం పొగ రాదు అని చెప్పగలను అన్నారు , ఇంకా ప్రీతం విషయానికొస్తే సమంతా కు వాడికి ఏదో ఉంది అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే వాడు చూడడానికి గే లాగా ఉంటాడు. నాకు తెలిసిన మట్టుకు ప్రీతం ఒక గే నే అందుకే సమంత వాడితో ఎలాగున్నా ఇబ్బంది పాడేది కాదు అని చెప్తూ ఇట్లాంటి వాడికి సమంతాకు అక్రమ సంబంధం అంటగట్టడం తప్పు అన్నారు.