గత రెండు మూడు నెలలుగా నాగచైతన్య సమంత ల విడాకుల ఉత్కంఠకు అక్టోబర్ రెండవ తారీకున తెరదించిన నాగచైతన్య సమంత లు ఒకరికొకరు దూరంగా ఉంటూ , వ్యక్తిగత ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే.
ఒకరినొకరు దూరం చేసుకుని ఎంతో మనో వేదన చెందుతున్న వీరు విడాకులు అనే పీడకల నుండి దూరం కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాగ చైతన్య తన జీవితాన్ని పునఃప్రారంభించడానికి తన కుటుంబానికి దూరంగా ఫ్లాట్ కొని ఒంటరిగా జీవిస్తున్నాడు. మరియు చిత్రపరిశ్రమలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు.
సమంత జీవితానికి వస్తే తాను విడాకులు ప్రకటించినది మొదలుకొని రకరకాల వదంతుల భారాన్ని మోస్తూ వచ్చింది, తనకు తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం తో అక్రమ సంబంధం ఉందంటూ, మరియు సినీ రంగాల్లో రాణించడానికి పిల్లలను కన్నడానికి సిద్ధంగా లేదంటూ రకరకాల వదంతులు ఆమె భరిస్తూ వచ్చింది.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్న నాగ చైతన్య తన క్యారెక్టర్ ను హేళన చేసిన వారిని గద్దించక పోవడం వల్ల . సమంత ఎంతో మనో వేదన చెందింది. ఇక ఈ బాధ నుండి నివృత్తి పొందడానికి వచ్చిన సినిమా అవకాశాలను కాదనకుండా ఒప్పేసుకుంటూ బిజీగా మారిన్నపటికి ఈ వదంతులు ప్రచారం కావడం మానక ఉండడంతో తాను సినిమాల నుండి కొంత కాలము గ్యాప్ తీసుకొని వదంతులపై పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. అందుకు ఆమె వదంతులు సృష్టిస్తున్న వారిపై కోర్టులో కేసు వేసింది.
ఇక తన పిటిషన్ కోర్టులో కొనసాగుతుండగా మనశ్శాంతి కొరకు ఉత్తర భారతంలోని హైందవ పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఉత్తరాఖండ్ కు ఆధ్యాత్మిక పర్యటన చేసింది. ఇక అక్కడి నుండి తిరిగి హైదరాబాద్ కు వచ్చిన ఆమె వెంటనే తన సన్నిహితులు శిల్పరెడ్డి మరియు ప్రీతం తో కలిసి దుబాయ్ కి ప్రయాణమైంది.
దుబాయ్ లో రకరకాల వేడుకలలో మరియు మనసును ఆహ్లాదపరిచే పనులలో సమంత బిజీగా ఉన్నా ఫోటోలు ఇంటర్నెట్లో ఇంస్టాగ్రామ్ ఐడి ద్వారా షేర్ చేసుకుంది. దుబాయ్ కి ట్రేడ్ మార్క్ అయినా బుర్జ్ ఖలీఫా వద్ద దిగిన ఫోటోలు, దుబాయిలో తాను ప్రయత్నించిన lebanese లెబనీస్ భోజన పదార్థాల ఫోటోలను మరియు రెయిన్బో కేక్ ఫోటోలను పంచుకున్నారు ఆ ఫోటోలలో సమంత ఆహ్లాదంగా కనిపించడంతో మళ్లీ పాత సమంతను చూస్తున్నట్టు ఉంది అని అభిమానులు అభిప్రాయపడ్డారు.
ఇక మొదటి నుండి తనతో కలిసి తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నా తన అత్యంత సన్నిహితులు ప్రీతం మరియు శిల్ప తో కలిసిన ఫోటోలను కూడా ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత ఇది సమంత చేసిన రెండవ పెద్ద ప్రయాణం. ఈ యాత్రలతో గత కాలంలో జరిగిన ఒడిదుడుకులను మరిచి మళ్లీ సినిమాలపై శ్రద్ధతో పని చేసే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.