samantha

Samantha- ఎన్నో త్యాగాలు చేసిన సమంతకు అక్కినేని కుటుంబం ఏమిచ్చింది అంటున్న సమంత మేకప్ ఆర్టిస్ట్.

News

సమంత విడాకుల తర్వాత ఏదో ఒక రీతిలో తన గురించిన ప్రతి విషయం వైరల్ అవుతుంది. ముఖ్యంగా తన విడాకులకు కారణాలు ఏమై ఉండవచ్చు అనే కోణంలో అనేకమంది ప్రేక్షకులు సమంత వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తూ ఉన్నారు. సమంతా తను విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు సరైన క్లారిటీ ఇవ్వకుండా ఉన్నందుకు ప్రేక్షకులు సమంత పైన అన్ని వైపులనుండి నిఘా పెట్టి పరిశీలిస్తూ ఉన్నారు.

అయితే సమంత క్యారెక్టర్ పరంగా మంచిది కాదు అన్నట్టు ప్రజలు ఆమెను ఫోకస్ చేశారు అదే రీతిగా సమంతాకు ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం కు ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టు వార్తలు రాశారు ఇది కొద్దోగొప్పో సమంత మనసు పైన దెబ్బ కొట్టినంత పని చేసింది.

ప్రీతం విషయంలో మేమిద్దరం అక్కాతమ్ముళ్ల మని వాస్తవాలు చెప్పి ఈ అభిప్రాయాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఇదే అంశంపై ప్రీతం కూడా స్పందించి సమంత నాకు అక్క లాంటిది నేను ఆమెను జి జి అని పిలుస్తాను అని చెప్పాడు, ఇక ఇప్పుడు సమంతాకు సన్నిహితురాలైన ఆమె మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ కూడా స్పందించి కొన్ని పుకార్లకు దీటుగా సమాధానమిస్తూ సమంత గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

సమంత తన వద్ద పనిచేసే వ్యక్తులను పరాయివాళ్ళు కాకుండా సొంత మనుషుల్లాగా చూసేది అని ఆమె ఎవరి పట్ల భేదము చూపించేది కాదని , అలాంటప్పుడు తన సొంత కుటుంబం అయిన అక్కినేని కుటుంబం గురించి ఆమె ఎంత ఆలోచించి ఉంటుంది, సమంత తన కుటుంబాన్ని ఎంతో ప్రేమించేది ఆ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది కూడా తను చేయలేదు, ఎన్నో పెద్ద సినిమాలను అక్కినేని కుటుంబం కొరకు వదిలేసుకుంది సమంత అని చెప్పుకొచ్చారు.

సమంతా ఎన్ని సినిమాలు చేసి సక్సెస్ అయినప్పటికీ నాగ చైతన్య నే బ్రతికింది, నాగ చైతన్య అంటే సమంతాకు ప్రాణం అని చెప్పింది, అయితే ఎంతో అందంగా కనిపించే వీరిద్దరి జోడి ఎందుకు విడిపోయారు అనే విషయము ఎన్నో ఏండ్లుగా తన వద్ద మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న నాకే చెప్పలేదు అంటే తన భర్త ఇంటి పరువు తన పరువు గా భావించి చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను అని అన్నారు.

మరియు పిల్లలు కనడం సమంతాకి ఇష్టం లేకనే విడిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పుకారుకు స్పందిస్తూ, పిల్లలు కనాలని సమంతాకు ఎంతో ఆశ ఉండేదని , పిల్లల్ని కని త్వరగా తన ఫ్యామిలీ లైఫ్ మొదలుపెట్టాలని ఆశతో సమంత ఉండేదని, పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంపై రకరకాల పుస్తకాలు చదివి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేదని, పిల్లల పట్ల తాను ఎన్నో కలలు కన్నదని అలాంటి వ్యక్తి పైన పిల్లలు కనడం ఇష్టం లేదని రాసిన పుకార్లను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది అన్నారు సాద్నా సింగ్‌.

మరియు సమంత తన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది తను తాజాగా నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత బాలీవుడ్ లో ఎన్ని అవకాశాలు వచ్చినా సమంత వాటికి నో చెప్పేసింది. సమంతా తన కుటుంబానికి గౌరవిస్తూన్న మంచి కోడలు గా ఉన్నారు కానీ తను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందొ ఆమె క్లారిటీ ఇవ్వనని రోజులు పుకార్లు రాయడం మానేయండి అంటూ వేడుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *