సాధారణంగా ఏదైనా ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే సినిమా నిర్మాతలు మరియు చిత్రబృందం ఒక సినీ ప్రముఖుడిని లేదా సమాజంలో పేరు గల వ్యక్తి ని సంప్రదించి ఒప్పించి మరీ సినిమాను ప్రమోట్ చేయించుకుంటారు. అయితే నాట్యం సినిమా మాత్రము అందుకు భిన్నంగా ఏ ప్రముఖ యాక్టర్ ని కలవకుండా చిత్ర పరిశ్రమలో గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ వచ్చి నాట్యం సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు, చిరంజీవి , జూనియర్ ఎన్టీఆర్ , ఉపాసన వంటి బిగ్ షాట్ లు ఈ సినిమాను ప్రమోట్ చేసే తీరును చూసిన అభిమానులు ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఎంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు.
ఇక ఈనెల 22వ తారీఖున విడుదలకు సిద్ధమవుతున్న నాట్యం సినిమా సాంప్రదాయ కళల ను బేస్ చేసుకొని నిర్మించబడిన సినిమా. ప్రస్తుత కాలంలో ఇలాంటి సినిమాలు చేయడం అరుదు ఎందుకంటే పూర్తిగా ప్రజా ఆదరణ కోల్పోయిన సినిమాలో జాబితాలో ఇలాంటి సినిమాలు వచ్చి చేరయి. గతంలో వచ్చిన సాగరసంగమం శంకరాభరణం వంటి సినిమాలను ఆదరించేవారు నేటి తరంలో లేకపోయారు.
ఇక సరిగ ఆదరణ లేనటువంటి జనర్ లో వస్తున్న సినిమా నాట్యం. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంధ్యా రాజ్ ఒక క్లాసికల్ డ్యాన్సర్ ఆమెకు అసలు హీరోయిన్ అభినయం గాని హీరోయిన్ అనుభవం కానీ లేనటువంటి వ్యక్తి, ఆమెను యూట్యూబులో చూసినటువంటి అనేకులకు ఆమె ఒక కూచిపూడి నర్తకి గా తెలుసు అలాగే తాను చేసిన వందలాది షోలో నేటికీ యూట్యూబ్ లో మనకు దర్శనమిస్తుంటాయి. మరియు తాజాగా ఆమె చేసిన కృష్ణ శబ్దం అనే నాట్యం సుమారు పది లక్షల కంటే ఎక్కువ వ్యూస్ కలిగి ఉంది ఇదే ప్రస్తుతం మన భారతదేశంలో అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన క్లాసికల్ డాన్స్ వీడియో.
ఇక సంధ్య రాజ్ కు నాట్యం మొదటి సినిమా కాదు గతంలో 2017 సంవత్సరంలో యూటర్న్ సినిమా మలయాళంలో కేర్ఫుల్ సినిమా రీమేక్ లో నటించింది కానీ ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత తాజాగా రేవంత్ దర్శకత్వం వహించగా తీసినటువంటి లఘుచిత్రం నాట్యం ఈ లఘు చిత్రం మంచి సక్సెస్ను సంపాదించుకొనగ ఇదే లఘుచిత్రాన్ని ఇన్స్పిరేషన్తో భారీ చిత్రం నిర్మించడానికి పూనుకున్నారు సంధ్య రాజ్, ఇక ఈ సినిమాకు ప్రధానమైన ఎడిటింగ్ డైరెక్షన్ వంటి వివిధ పనులు రేవంత్ గారి చేస్తున్నారు మరియు సంధ్య రాజ్ ప్రొడ్యూసర్ గా పరిచయమవుతున్నారు.
అయితే ఒక క్లాసికల్ డాన్సర్ మరియు సినిమా అనుభవం లేనటువంటి ఈమె తన మొదటి సినిమాలోనే ప్రొడ్యూసర్ గా మారి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు.ఆదరణ లేనటువంటి ఈ సినిమాను ఎందుకు చేయాల్సి వచ్చింది మరియు పెద్దపెద్ద ప్రముఖులు ఈ సినిమాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని ప్రేక్షకులు పరిశీలించగా, సౌందర్య రాజ్ వ్యాపారవేత్త మల్టీ మిలీనియర్ ramco అధినేత పి.అర్. వెంకట రామ రాజా గారీ కుమార్తె మరియు సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజు గారి చిన్నకోడలు కూడా. ఇందును బట్టి సంధ్యా రాజు ఎవరో కూడా ప్రేక్షక ప్రపంచానికి తెలియకున్న గొప్ప గొప్ప ప్రముఖులు ఆమె వద్దకు వెళ్లి ఆమెను అభినందిస్తూ తన సినిమాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు.