sarayu-on-shanmukh-jaswanth

సరయు ఎలిమినేట్ అయ్యాక షణ్ముఖ్ ని మొగోడివి అయితే సింగిల్‌గా గేమ్ ఆడు లేదంటే గాజులు వేసుకుని కూర్చో

News

బిగ్ బాస్ ఇంటిలో నుండి ఎలిమినేట్ అయ్యాక ఇంట్లో ఉన్న వాల్లు ఎలా అడబోతున్నారని హౌస్ మేట్స్ సీక్రెట్స్ ని బయట పెట్టిన సరయు .బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి ఎలిమినేషన్ జరిగి పోయింది ఈ ఎల్మినేషన్ లో యూట్యూబ్ నుండి సడెన్ గ సంచల్నంగా మారిన 7 ఆర్ట్స్ సరయు ఎల్మినేట్ అయింది.

అయితే ప్రేక్షకులలో సరయు ఎల్మైనేషన్ ఎక్కడో తెలియని అసంతృప్తిని మిగిలించింది. యూట్యూబ్లో బోల్డ్ కంటెంట్ తో సామాజిక అంశాలపైన ఓపెన్ గా మాట్లాడుతూ ఎన్నో షార్ట్ ఫిల్మ్ లు చేశారు వాటిలో తనకు సక్సెస్ మరియు క్రేజ్ తెచ్చినవి 2 షార్ట్ ఫిల్మ్ లు ఒకటి పెళ్లి చూపులు అయితే రెండవది సరయు క్లినిక్ ఈ రెండు షార్ట్ ఫిల్మ్ లలో మగవారితో పోటీ పడుతు బోల్డ్ డైలాగ్స్ వేస్తూ ప్రేక్షకులలో గుర్తింపు పొందింది ఇవే కాక 7 ఆర్ట్స్ ఛానల్ లో ప్రసారం అవుతున్న 21 వెడ్స్ 30 సీరీస్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

సరయు బిగ్ బాస్ కి ఎంపికైయ్యారు అని తెలియగానే ఆమె అభిమానులు గొప్పగా అంచనాలు వేసుకున్నారు. యూట్యూబ్ లో ఆమెకు ఫాలోయింగ్ మామూలుగా లేదని మిలియన్లలో ఆమె ప్రేక్షకులు ఉన్నారని బిగ్ బాస్ లో గట్టి పోటీ ఇస్తుంది అని అనుకున్నారు.

sarayu-on-shanmukh-jaswanth
sarayu on shanmukh jaswanth

అయితే ఆమె ఏ విధంగా అయితే షార్ట్ ఫిల్మ్ వీడియోస్ లో ఉంటారో ఏ విధంగా గా ఓపెన్ గా మాట్లాడతారో ఆ విధంగా బిగ్ బాస్ ఇంట్లో ప్రదర్శించలేదు అని తనను ఎలమినేషన్ నుండి కాపాడ లేక పోవటానికి కారణం అదే అని అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు..

కానీ సరయు ఎలిమినేషన్ పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు సరుకు ఓట్లు తక్కువ రాలేదని ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారని ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఆ రోజు ఎలిమినేషన్ ప్రక్రియ అంతా కూడా ముందే ప్రీ ప్లాన్డ్ గా అనిపించిందని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎలిమినేషన్ ప్రక్రియలో చివరగా మిగిలిన ఆరు మందిలో శనివారం రాత్రి రవి హామీద సేఫ్ జోన్ లోకి వెళ్లగా మిగిలిన నలుగురు ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా సరయు ఎలిమినేట్ అవుతుందన్న విషయం ముందే లీక్ అయినట్టుగ సోషల్ మీడియా ద్వారా తెలియడం తో ప్రజలలో ఆందోళన మొదలయింది.

బిగ్ బాస్ ఇంటి నుండి బైటికి వచ్చాక అరియాన మెంటర్ గా ఉన్న బిగ్ బాస్ బజ్ ప్రోగ్రాంలో ఒక్కొక్క పోటీదారుని గురించి చాలా విషయాలు బయట పెట్టి వారి పైన తన అభిప్రాయం తెలిపారు.

బిగ్ బాస్ నుండి తను ఎల్మినెట్ అయిన రాత్రి నాగార్జున తో కలిసి స్టేజ్ మీద ఉన్నపుడే ఒక్కొకరి గురించి వ్యంగ్యంగా మాట్లాడింది. సిరి షణ్ముకులు ముందే ఇంటి బయట ప్లాన్ వేసుకొని ఒక స్ట్రాటజీ ప్రకారము గేమ్ ఆడుతున్నారు అని మాట్లాడింది, లహరి ఇంట్లో ఒక గ్యాంగ్ లీడర్ గా ఫీలవుతుందని లహరి కి క్లాస్ పీకింది మరియు సిరి కాజల్ ఆడుతున్న తీరును బట్టి వాల్లు ఎలా ఆడబోతున్నారో వాళ్ళ ప్లాన్ ఏంటో బయట పెట్టింది.

అరియానా గ్లోరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తి కలిగించే విషయాలు బైట పెట్టింది. హౌస్ కెప్టెన్‌ సిరి మగాళ్లను అడ్డుపెట్టుకుని ఆట ఆడుతుందని , రవి అయితే మంచోడి లాగా నీతి సూత్రాలు చెప్తాడు కానీ మ్యాటర్ లేదు అని, ఇంట్లో దమ్మున్న మొగోడు ఉన్నాడంటే విశ్వ మాత్రమే అని తన అబిప్రాయం తెలియజేసింది ఆ తర్వాత షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ ‘నిజంగా నీలో దమ్ము ఉంటే మొగోడివి అయితే సింగిల్‌గా గేమ్ ఆడు.

లేదంటే గాజులు వేసుకుని కూర్చో.. నేను గాజులు వేసుకున్నా కూడా సింగిల్‌గ ఆట ఆడతా.. నువ్ ఆడలేవు కాబట్టి మూలన కూర్చో’ అంటున్న అని నీలో మ్యాటర్ ఉంటే గుంపులు కట్టకుండా ఆడు లేదా మూలన కూర్చో అని షణ్ముఖ్‌ని ఉతికి అరేసింది. సన్నికి అసలు క్యారెక్టర్ లేదని సన్ని ఫోటో ఫ్రేమ్ ను విరిచి పారేసిన. తను సింహనని సింహం సింగిల్ గా వస్తాదని ఎలుకలు మాత్రమే గుంపుగా వస్తాయని పవర్ పంచ్ డైలాగ్స్ వేస్తూ రెచ్చిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *