బుల్లితెరపై జడ్జ్‌లు, కమెడియన్స్, డ్యాన్సర్ అన్న తేడాలేవి కనబడకుండా పోతున్నాయి. డ్యాన్సర్లు డ్యాన్సులు మానేస్తున్నారు మరియు కామెడీలు చేస్తున్నారు. కమెడియన్లు కూడా కామెడీ మానేసి డ్యాన్సులు చేయడం మొదలు పెడుతున్నారు. ఇక జడ్జ్‌లు ఎప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకే ఐడియా లేదు.అయితే శేఖర్ మాస్టర్ జెడ్జి గా తన కంటూ మంచి పేరును తెచ్చుకున్నాడు.ఈ విహాయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.
అయితే ఈ మధ్యలో తనలోని కామెడీ యాంగిల్‌ను చూపిస్తున్నారు మాస్టర్ గారు. అలా స్కిట్లలో కామెడీ ని కూడా ప్రదర్శిస్తూ తనలోని నటనను అందరికీ పరిచయం చూపిస్తున్నాడు.అయితే శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు కామెడీ స్టార్స్ అనే షోలో జడ్జ్‌గా శ్రీదేవీతో కలిసి హంగామా చేస్తున్నారు. ఇక ఇలాంటి ప్రోగ్రాంలో ట్రాకులు క్రియేట్ చేసేందుకు ఆ షో నిర్వాహకులు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు.ఈ ప్రయత్నం లో భాగంగానే నటి శ్రీదేవీ మరియు శేఖర్ మాస్టర్ ల మధ్య ఏదో కెమిస్ట్రీ ఉన్నట్టు క్రియేట్ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు.
అయితే ఇటీవలే ముక్కు అవినాష్ తన స్కిట్ లో శేఖర్ మాస్టర్ ను మరియు శ్రీదేవీని వాడేశాడు. పెళ్లికి ముందు పులిలా ఉన్నవాడు పెళ్లి తరువాత పిల్లిలా ఎలా మారుతాడు అని చెప్పేందుకు శేఖర్ మాస్టర్ ను ఉపయోగించుకొని స్కిట్ వేయించాడు అవినాష్. అయితే ఆ స్కిట్ లో ఏకంగా శేఖర్ మాస్టర్ చేత చీపురు పట్టి ఊడిపించాడు అక్కడితోనే ఆగకుండా ఓ కొంగును కూడా శేఖర్ మాస్టర్ మీద కప్పేశాడు.
ఇలా శేఖర్ మాస్టర్ తన స్థాయిని తనకు తానే తగ్గించుకున్నాడు.ఇలా ఎంతోమంది ఈ బుల్లితెరపై తమ పైత్యాలను చూపిస్తుండగా వారిలో శేఖర్ మాస్టర్ ఏమి స్పెషల్ కాదేమోననిపిస్తోంది.
ఈ కార్యక్రమం శ్రీదేవి యొక్క తెలుగు టీవీ రీఎంట్రీ . ఆమె ఇంతకుముందు పాపులర్ షో అధర్స్ సీజన్ 2 లో నటుడు-నిర్మాత-టీవీ జడ్జి నాగబాబు కొనిదేలాతో పాటు తీర్పు ఇచ్చింది. అధర్స్ 2 ను యాంకర్ శ్రీముఖి మరియు జబర్దాస్త్ ఫేమ్ అభినయ కృష్ణ అదే అండి ఆదిరే అభి హోస్ట్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఈ షోలో మొట్టమొదటి సారి శ్రీముఖి తెలుగు టివి హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తింది.