senior-actress-jaya-lakshmi-daughter

సీనియర్ నటి జయలక్ష్మి కూతురు ఇప్పుడు వందల కోట్ల ఆస్తి పరురాలు, అమే ఎవరో తెలుసుకోండి.

Trending

ఓడలు బండ్లు అవడం బండ్లు ఓడలు అవ్వడం అనే సామెత మనం వినే ఉంటాం, నిజ జీవితంలో ఈ సామెత ఎవరి జీవితంలోనైనా జరిగిందా అని ఒక నిమిషం పరిశీలించినట్లయితే సినీ పరిశ్రమలో కొన్ని వేల మంది తమ జీవితాలలో మంచి స్థాయి నుండి అట్టడుగు స్థాయికి వెళ్లిన వారు, అట్టడుగు స్థాయిలో ఉన్నవారు ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. అందుకే సినీ ప్రపంచాన్ని ఒక మాయాజాలం గా వివరించారు. ఇక్కడ అవకాశాలు టాలెంటు రెండు లేకపోతే మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎంత యోగ్యుడైన పనికిరాని చెత్త తో సమానం గా పరిగణించ బడతాడు.

ఈ మాయా ప్రపంచంలో రాత్రికిరాత్రే గొప్ప స్టార్స్ అయిన వారు రాత్రికి రాత్రే కనపడకుండా అంతరించిపోయే స్థాయిలో కూడా ఉన్నారు, సినీ పరిశ్రమ అనేది ఒక పాచికల ఆట లాంటిది విజయం ఎప్పుడూ ఎవర్ని వరిస్తుందో చెప్ప లేనిది.

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి తాము సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సరే మేము పరిశ్రమలో ఎదగడానికి కష్టపడుతున్నాము అని అంటారు కానీ నేను ఎదిగాను అని మాత్రం చెప్పరు దీన్ని సినీ పరిశ్రమలో ఉన్న శ్రమ ఏంటో అర్థం చేసుకోగలం.

ఇలాంటి కష్ట సాగరాన్ని ఈదిన ఒక సీనియర్ నటి తన జీవితంలో అనుభవించిన ఒడిదుడుకుల ను తన కూతుళ్ళూ కూడా అనుభవించి కృంగిపోకుండా సినిమా పరిశ్రమ వైపునకే తన పిల్లలు పంపడానికి ఇష్టపడలేదు.

senior-actress-jaya-lakshmi-daughter

ఒకప్పటి మంచి పేరున్న సీనియర్ నటి జయలక్ష్మి ఆమె నటించిన కాలంలో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచి అందరి ప్రశంసలు అందుకున్న ఈవిడ తన కూతుళ్లను మాత్రం సినిమారంగంలోని కి దింప బోను అని ఖచ్చితంగా చెప్పేసింది.

నితిన్ సదా ల కాంబినేషన్ లో వచ్చిన జయం సినిమాలో సధా చెల్లెలు గా నటించిన యామిని శ్వేత జయలక్ష్మి గారి కూతురు,, ఆమె ఆ సినిమా తర్వాత మరి ఇంకే సినిమాలో నటించలేదు, ఆమెకు ప్రస్తుత హీరోయిన్ల వయస్సు ఉన్నప్పటికీ తనను హీరోయిన్ గా చేసేందుకు జయలక్ష్మీ గారు సిద్ధంగా లేనట్లు కచ్చితంగా చెప్పేశారు.

అయితే సడన్ గా జయలక్ష్మి గారి కూతురు విషయము తెరపైకి రావడానికి ముఖ్య కారణం ఇంతకాలం యామిని శ్వేత అమెరికాలో ఉండి . వివాహం చేసుకుని కొన్ని కోట్లకు యజమానురాలి గా మారింది. అయితే జీవితంలో విజయం వైపు దూసుకెళ్తున్న ఆమె తాజాగా తన స్వస్థలమైన విజయవాడకు మకాం మార్చింది. అక్కడ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఆనందంగా గడుపుతుంది. అయితే తన తిరిగి రాకతో సినీ పరిశ్రమలో ఒక చిన్నపాటి చర్చ మొదలైంది ఒకప్పటి సక్సెస్ఫుల్ సినిమాలో నటించిన ఈమె ఖచ్చితంగా ఏదో ఒక పాత్రను పోషించబోతున్నారు అనే అనుమానమే ఆమె గురించి మరింత తెలుసుకునే లా చేసింది.

ఈ విషయం పై యామిని తల్లి విజయలక్ష్మి స్పందించి నా కూతుర్లు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పంపడం లేదు అని ఖచ్చితంగా చెప్పింది, సినిమా ఇండస్ట్రీలో నా జీవితాన్ని నిలబెట్టుకోడానికి ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది నా బిడ్డలు ఆ బాధలను పడకూడదని అందుకే సినిమాలవైపు వాళ్ళ దృష్టిని మరల్చి విదేశాలకు పంపించాను , కేవలం నా కూతుర్ని బాలనటిగా మాత్రమే చూడాలి అనుకున్నాను ఆ ఆశ తీరింది. ఇక మళ్లీ ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ఒప్పుకోలేదు నా కూతురు పెళ్లి చేసుకొని విదేశాల్లో సంతోషంగా గడుపుతుంది. నా కూతుర్లు నా మాట దాటనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను కన్న తల్లిగా ఇంతకంటే నాకేం కావాలి అని జయలక్ష్మి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *