సినీ పరిశ్రమలో హైందవేతరులు నటించడం చాలా అరుదు , తమ మత విశ్వాసాలకు లోబడి చాలా కొద్దిమందే సినీ పరిశ్రమలో ఉన్నారు, వారిలో ఒకరు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన గారు. సన గారు ఒక ముస్లిం అయినప్పటికీ స్క్రీన్ పైన అచ్చమైన తెలుగింటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు, ఆమె ముఖ కాంతి వల్ల ఆమెకు అమ్మగా చెల్లిగా అక్కగా ఎన్నో పాత్రలు ఆమె పోషించే గలిగారు. ఇవే కాక కొన్ని నెగటివ్ రోల్స్ కూడా ఆమె పోషించారు. ప్రస్తుతం ఆమె వెండితెర తో పాటు బుల్లితెర ను కూడా అలరించేందుకు కొన్ని సీరియల్లో కూడా నటిస్తున్నారు.
మనందరికీ సూపర్ సక్సెస్ ఫుల్ గా అనిపించినా సనా గారు తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి ఆహ్వానించబడ్డారు అక్కడ ఆమెకు తన జీవితంలో జరిగిన సంఘటనలు పంచుకోగా ప్రజలకు బాధ కలిగించాయి. తన సినిమా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఎంతోమంది తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని హెల్ప్ చేస్తామంటూ ముందుకు వచ్చి మోసం చేశారని తెలియజేసింది, ఆలీ గారు ఏ ఏ విషయాల్లో నిన్ను మోసం చేసారో చెప్పగలరా అని ఆవిడ ప్రశ్నించినప్పుడు అందుకామె ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకుంటు కొన్ని విషయాలు తెలియజేసింది, ఆమె బాధను గమనించిన ఆలీ గారు ఆమెను ఓదార్చారు.
తన కెరీర్లో ఒక స్థాయికి ఎదిగే అంతవరకు ఎవరో ఒకరు నన్ను మోసం చేస్తూనే ఉన్నారని, ఎంతో మంది వద్ద మోసపోయినప్పటికీ నా సినీ ప్రస్థానం కోసం అందరిని నమ్మాల్సి వచ్చేదని, కొన్ని సందర్భాల్లో అయితే ఎప్పటికీ గుర్తుండిపోయే బాధలు కలిగాయని, అన్నిటినీ ఎదుర్కొని ఇప్పుడు సమస్యల నుండి బయట పడ్డానని ఆమె తెలియజేశారు.
ఇక సన్న గారు ప్రస్తుత పరిస్థితులలో చాలా తక్కువ సినిమాల్లో చేస్తున్నారు మరియు వెండి తెరపై కాకుండా బుల్లితెర లో రాణించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
Also Read :
అవకాశాల కోసం ఎదురు చూసి.. కనుమరుగై పోయినా ఒకప్పటి కథానాయకి