నేను ఈవిధంగా ఉన్నానంటే అందుకు కారణం హైపర్ ఆది అంటూ ఆది గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పెట్టాడు శాంతి స్వరూప్. వివరాల్లోకి వెళ్తే ఈటీవీ లో కామెడీ ప్రోగ్రాంలు గా ప్రసారం అవుతున్నా జబర్దస్త్ మరియు ఇతర షోలు మంచి రేటింగ్ సంపాదిస్తూ దూసుకెళ్తునాయి. కొత్తగా ఈ జాబితాలోకి వచ్చిన శ్రీ దేవీ డ్రామా కంపెనీ కూడా మంచి ప్రజాదరణ సంపాదించుకొని అదిక టీ అర్ పి ను కుడబెట్టు కుంటుంది. ఈ షో ఇంత హిట్ అవ్వటానికి కారణం జబర్దస్త్ షో లో నవ్వులు పుయించే ఆర్టిస్టులే ఈ షోలో కూడా చేయతమే ముఖ్య కారణం , శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ఉన్నవారంతా ప్రేక్షకులకు ఇంతకు ముందు నుండే పరిచయం ఉండటం తో ప్రజలు ఈ షో కి త్వరగా అలవాటు పడ్డారు అని చెప్పుకోవచు. ఈ షోకు సుడిగాలి సుదీర్ యాంకర్ గా ఉండగా ఇంద్రజ జడ్జి వ్యవహరిస్తున్నరు.
తాజాగా త్వరలో ప్రసారం అవ్వాబోయే ఎపిసోడ్ యొక్క ప్రమోను ఈ షో విడుదల చేసింది దాంట్లో డీ మరియు జబర్దస్త్ ఆర్టిస్టులకు అవార్డులు అందించారు. అవార్డు అందుకున్న వాళ్లలో శాంతిస్వరూప్ కూడా ఉన్నాడు . అవార్డు తీసుకున్న తర్వాత ఎమోషనల్ అయిపోయి తన కెరియర్ ప్రారంభం నుండి ఎదురుకున్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ కనీరు కార్చెసాడు.
కెరియర్ ప్రారంభంలో అవకాశాలు లేక చేతిలో డబ్బులు లేక తిందామంటే సరైన తిండి కూడా లేని పరిస్థితుల్లో గుళ్లో పెట్టే ప్రసాదం తిని ఆ పూట గడిపేవాణ్ని లేదా కాస్తోకూస్తో డబ్బు ఉంటే రెండు మూడు అరటి పండ్లు తిని ఆ రోజుకు అదే సరిపెట్టుకునే వాడిని అన్నాడు. జోబులో పది రూపాయలు ఉంటే పది వేలు ఉన్నట్టుగా భావించేవాడిని. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని ఇంట్లో వారికి ఎన్నడూ చెప్పలేదు ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బాగు చేస్తానని నమ్మకం వారు నా పై పెట్టుకున్నారు కానీ నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని తెలిస్తే వేరేలా ఉండేదని చెప్పలేదు అన్నాడు.
అనుకోకుండా 2007లో నాన్న చనిపోతే ఆయన అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో రెండు వేల రూపాయలు అప్పు చేసి ఆ కార్యక్రమాన్ని జరిపించాను.
నా ఈ దయనీయ పరిస్థితులు చూసిన జబర్దస్త్ ఆర్టిస్ట్ లలో ఆది నన్ను ఎంతగానో ఆదుకున్నాడు . ఈరోజు నేను మూడు పూటలా భోజనం చేస్తున్నాను అంటే దానికి కారణం ఆది నే అంటూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నాడు. ఇంకా మాట్లాడుతూ నేను చనిపోయే చివరి క్షణంలో కూడా ఆది పేరు తలుచుకుంటా అని ఎమోషనల్ అయిపోయాడు.
ఈ ప్రోమో చూసిన అభిమానులు శాంతి స్వరూప్ తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిని మర్చిపోకుండా జ్ఞాపకముంచుకొని అందరి ముందు గర్వంగా చెప్పినందుకు ప్రశంసిస్తున్నారు.
ఆది తన కెరియర్ లో ఎంతో మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశాడు ఇమ్మానియేల్ వర్ష రైజింగ్ రాజు వంటివారు ఆది మంచితనం గురించి చెబుతూ చాలా సార్లు ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.