జబర్దస్త్ శాంతి స్వరూప్ గురించి ప్రతేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు. ముక్యంగా జబర్దస్త్ చూసే వారికి శాంతి స్వరూప్ పేరు సుపరిచితమే. ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ లో ఆర్టిస్ట్ గా పని చేసే శాంతి స్వరూప్ తో అందరికి మంచి పరిచయమే ఉంది. జనాలు అతను చేసే కామెడీకి బాగానే కనెక్ట్ అవుతూ ఉంటారు కూడా. ఎన్నో సంవత్సరాలుగా అతను జబర్దస్త్ స్టేజి పైన లేడీ గెటప్స్ వేస్తూ మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. అతను తన మృదువు మస్తత్వం తో మంచి ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు.
ఈయనకు సంబంధించిన ఆస్తుల గురించి మరియు కార్ల గురించి ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. గతం లో కూడా ఇలానే శాంతి స్వరూప్ ఆడి కారు కొన్నాడని, ఏదో టైంపాస్ కి జబర్దస్త్ లో చేస్తున్నాడు కానీ అతనికి డబ్బులు లేక కాదు అని చాలామంది ఆ మధ్య తెగ మాట్లాడారు.
అతనికి కొన్ని లక్షలు విలువ చేసే ఆస్తులు ఎన్నో ఉన్నాయని పుకార్లు చాలానే ఉన్నాయ్. అయితే వీటన్నిటికీ శాంతి స్వరూప్ క్లారిటీ ఇచ్చాడు, ఆటోకే డబ్బులు లేని నేను ఆడి కారు ఎలా కొంటాను అని సమాధానము ఇస్తూనే… జబర్దస్థ్లో లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు అనే వార్తల్లో కూడా ఎటువంటి వాస్తవం లేదని ఆయన అన్నారు.
జబర్దస్థ్లో ఎవరు కూడా లక్షల్లో సంపాదించారు అని అయన గుర్తు చేస్తూ … ఒకవేళ లక్షల్లో సంపాదించే మాట నిజమే అయితే జబర్దస్థ్లో ఉంటున్న వారికి ఆర్ధిక ఇబంధులు ఎందుకు ఉంటాయి అన్నాడు. అయితే జబర్దస్తులో కన్నా వారు స్పెషల్ ఈవెంట్లకే ఎక్కువ సంపాదిస్తుంటారట.జబర్దస్థ్లో సంపాదన మీరు ఊహించిన దాని లో సగం కూడా ఉండదు అని గుర్తు చేసాడు శాంతి స్వరూప్.
అయితే అతనికి యూట్యూబ్ లో కూడా ఒక ఛానల్ ఉంది అందులో అతనికి 1.5 లక్షల సుబ్స్క్రైబ్ర్లు కూడా ఉన్నారు, యూట్యూబ్ నుండి కూడా శాంతి బానే సంపాదిస్తున్నారు.అయితే ఇటీవలే అతను మహేంద్ర తార్ కార్ ను కొన్నాడు. అది అతని డ్రీం కార్ అట. ఈ విషయాన్నీ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో ద్వారా చెప్పాడు, ఎన్నో సంవత్సరాలుగా కస్టపడి కూడబెట్టిన డబ్బుతో తన డ్రీం కార్ ను కొనడం సంతోషంగా ఉందని అతను చెప్పాడు ఆ వీడియో లో.
అతను తన ఛానల్ లో పెట్టె ఏ వీడియో ఐన సరే దానికి లక్షల్లోనే వ్యూస్ వస్తుంటాయి. కాబట్టి అతను యూట్యూబ్ నుండి కూడా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదిస్తున్నట్లు అర్ధం అవుతుంది. కానీ కేవలం జబర్దస్త్ నుండే లక్షల్లో సంపాదిస్తున్న మాట అవాస్తం అని ఆయన అన్నారు. నిజానికి జబర్దస్త్ లో పేమెంట్ కూడా కచ్చితమైన డేట్ కి ఇవ్వరు అని కూడా ఆయన అన్నారు.