డీ షో కు శేఖర్ మాస్టర్ కు ఎలాంటి సంబంధం ఉందో మనందరికి తెలుసు. డీ షో ను ఒంటి చేత్తో నడిపించగల సామర్ధ్యం ఉన్నవాడు . శేఖర్ మాస్టర్ కు ఇలాంటి సామర్ధ్యత ఒక్కసారిగా వచ్చి పడలేదు. ఆయన ప్రముఖ సినిమాలకు ప్రముఖ హీరోలకు టాపు లేచి పోయే స్టెప్పులను కొరియోగ్రఫీ చేసి ప్రేక్షకులనుండి రికార్డులు బద్దలు కొట్టే రీతిగా ఆదరణను పొందుకుని ఈనాడు ఆ స్థాయికి ఎదిగాడు.
డీ షో లో మాస్టర్ జడ్జి సీట్లో కూర్చొని కూల్ గా కంటెస్టెంట్ ల స్టెప్పులకు జడ్జిమెంట్ ఇచ్చే స్టైల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అదే సమయంలో ఇతర షోల నుండి వచ్చిన యాంకర్లు కామెడీ ఆర్టిస్టులు ఆయన గురించి రకరకాల సెటైర్లు వేసిన పంచులు వేసిన అన్నిటీని స్పోర్టివ్ గా తీసుకుని చిరునవ్వు చిందించే ఆయన మనస్తత్వానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కెరటంలా పొంగిపోతున్నారు . ఒక మాటలో చెప్పాలంటే ఆయన పక్కన కూర్చుని ఉండే ఇతర ఇద్దరు జడ్జీల కంటే శేఖర్ మాస్టర్ చాలా పవర్ఫుల్ జడ్జిగా ప్రజలు ఆయనను అంగీకరించారు అభిమానించారు.
ఇంత అభిమానాన్ని మరియు పబ్లిసిటీని కూడబెట్టుకున్న శేఖర్ మాస్టర్ గత కొన్ని ఎపిసోడ్ల లో డి షో జడ్జి సీట్లో కనిపించడం లేదు ఆయనకు బదులుగా గణేష్ మాస్టర్ కనిపించడం గమనార్హం.
అయితే శేఖర్ మాస్టర్ ఢీ షో నుండి కనుమరుగై పోవడం చూసిన అభిమానులు తట్టుకోలేక ఆయన ఎందుకు షోలో కనిపించటం లేదు అని కలవరపడుతూ ఆయన షో కు ఎందుకు రావడం లేదు అని కనుక్కునే పనిలో పడ్డారు. ప్రజల ఆరా మేరకు తెలిసిన విషయం ఏంటంటే శేఖర్ మాస్టర్ డీ షో నిర్మాణసంస్థ మల్లెమాల ఆయనను కావాలనే షో నుండి తప్పించినట్లు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే ప్రతి టీవీ షోల నిర్మాణ సంస్థలకు కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని మీరి నట్లయితే చిన్న పెద్ద అని చూడకుండా రూల్స్ మీరిన వారిపై కన్నెర్ర చేస్తూ ఉంటాయి.
ఇక ఇదే కోవలోకి శేఖర్ మాస్టర్ విషయం కూడా వస్తోంది , డీ షో 13వ సీజన్ ప్రసారం అవుతున్న సమయంలో ఒక సందర్భంలో మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరించడానికి వెళ్లారు, ఈ రీతిగా మల్లెమాల రూల్ అతిక్రమించిన ఆయనను ఢీ షో నుండి మల్లెమాల సమస్త నిష్క్రమించింది ఆయనకు బదులుగా గణేష్ మాస్టర్ కొనసాగించేందుకు కాంట్రాక్టు కుదిరించుకుంది.
ఇక ప్రేక్షకులంతా కేవలం 13వ సీజన్ లో మాత్రమే కనిపించరేమో అని భావించారు కానీ మల్లెమాల సంస్థ మాత్రం తన నిర్ణయాల పట్ల కచ్చితంగా ఉంటూ 14 సీజన్లో కూడా శేఖర్ మాస్టర్ కు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు.
ఇక గణేష్ మాస్టర్ ని తీసుకోవడానికి ముఖ్యకారణం ఆయన కూడా శేఖర్ మాస్టర్ అంతగా సినిమాలకు చక్కటి కొరియోగ్రఫీ అందించడమే. గతంలో గణేష్ మాస్టర్ కొరియోగ్రఫి అందించిన గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.
అయితే తాజాగా వస్తున్న ప్రచారం ప్రకారం శేఖర్ మాస్టర్ తో తిరిగి మల్లెమాల చర్చలు జరుపుతున్నారట మరియు త్వరలో ఆయనను ఢీ షో లో కొనసాగించబోతున్నారట అయితే ఈ పుకార్లు ఎంతవరకు వాస్తవమో కాలమే సమాధానం చెప్పాలి.