బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ రోజుల్లో తన వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు ఎదురుకొంటూ ఉంది. అటువంటి పరిస్థితిలో, ఆమె భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన తరువాత మొదటిసారిగా, శిల్పా శెట్టి తన నిశ్శబ్దాన్ని వీడి, ఈ విషయంపై స్పందించారు. ఇందుకోసం శిల్ప శెట్టి సోషల్ మీడియా సహాయం తీసుకున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ నుండి దూరం అయ్యారు.
గురువారం రాత్రి, శిల్పా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పుస్తకం నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ జేమ్స్ థర్బర్ అనే రచయిత యొక్క ఒక కోట్ను హైలైట్ చేస్తుంది, ఆ పోస్టుల్లో క్యాప్షన్ ఏంటంటే “కోపంతో వెనక్కి తిరిగి చూడకండి, భయంతో ముందుకు చూడకండి, కానీ అవగాహనతో చూడండి.” అని ఉంది.
పుస్తకంలోని ఈ భాగాన్ని పంచుకునేటప్పుడు శిల్పా ఏమీ వ్రాయలేదు, కానీ ప్రస్తుత పరిస్థితులలో శిల్పా తనను తాను ఎలా ధైర్యపరుచుకుంటున్నారో స్పష్టమవుతుంది. అశ్లీల వీడియోలకు సంబంధించిన కేసులో రాజ్ కుంద్రాను జూలై 19 న ముంబై పోలీసులు అరెస్ట్ చేశారన్నా విషయం మనకు తెలిసిందే.అయితే ఆమె ‘‘తన భర్తకు అటువంటి విషయాలలో ఏమాత్రం సంబంధం లేదని అతను చాలా అమాయకుడని, రొమాంటిక్ మూవీస్ తీస్తారే తప్ప ఎప్పుడు కూడా పోర్న్ వీడియోలు తీయలేదని ముంబయికి చెందిన పోలీసుల ముందు ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వెల్లడించారు. ఆ రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని శిల్ప తాను సమర్పించుకున్న వాంగ్మూలంలో వివరించారు.
అయితే శుక్రవారం రోజున రాత్రి దాటేదాకా ఈ నేరారోపన విషయం పై ముంబయి క్రైం బ్రాంచ్ కు సంబంధించిన ఒక టీం నటి శిల్పను ఇంచుమించుగా ఆరు గంటల సేపు ఆరాతీశారు.
అయితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో వచ్చే హాట్‌షాట్స్ అన్ని కూడా కుంద్రా బావగారైనా ప్రదీప్ భక్షి అనే వ్యక్తి తీసేవాడని ఆమె తానా విచారణలో చెప్పారు అని పోలీసు వర్గాలు తెలియజేశాయి.అయితే పోర్న్ వీడియోలకు, తన భర్త కుంద్రాకు ఎటువంటి సంబంధం లేదని ఆమె వెల్లడించినట్లుగా తెలియజేసారు.
అంతేకాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమయ్యే హాట్‌షాట్స్ కంటెంట్‌పై ఆమెకి ఎలాంటి ఐడియా లేదని మరియు దాంట్లో తన ప్రమేయం అసలు కొంచెం కూడా లేదని వెల్లడించింది.
గతంలో బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో పనిచేసిన తర్వాత, శిల్ప శెట్టి ఒక బిజినెస్ డీల్ గూర్చి చర్చించడానికి లండన్ వెళ్లినప్పుడు ఆమె కు మరియు కుంద్రాకు మంచి పరిచయం ఏర్పడింది.
వీడియో కాల్‌లో అలా ఆడిషన్ ఇవ్వమన్నారు.
ఏ కష్టం చేయరు మీకు డబ్బు ఎలా వస్తుంది.?
వారు అలా రెండేళ్లపాటు డేటింగ్ చేశారు.తర్వాత 2009లో వారిరువురు కుటుంబ సమక్షంలో ఘనంగా పెళ్లిచేసుకున్నారు. కొంత కాలానికి వారు ఐపీఎల్ క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించారు. ఎనిమిది టీమ్స్ లల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో వారు తమ పెట్టుబడి పెట్టారు. అయితే అప్పుడు స్పాట్ ఫిక్సింగ్ నేరారోపన పై చిక్కుకున్న కుంద్రాకు సుప్రీంకోర్టు అతనికి జీవితకాల నిషేధం విధించింది. అంతేకాకుండా 2018లో ఒక బిట్ కాయిన్ వ్యాపారంలో అవకతవకల కేసులో కూడా కుంద్రాపై ఈడీ విచారణ జరిపింది.