సిద్ధార్థ్ సూర్యనారాయణ అలియాస్ హీరో సిదర్త్ ప్రధానంగా తమిళం, తెలుగు మరియు హిందీ భాషా చిత్రాల పరిశ్రమలో పని చేశారు. నటనతో పాటు, స్క్రీన్ రైటర్, నిర్మాత మరియు ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా సినిమాలలో కనిపించరు. అన్ని పరిశ్రమలో పనిచేసి గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తెలుగులో `బాయ్స్` సినిమాతో ఎంట్రీ ఇచ్చి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా ద్వారా మంచి హిట్ సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత బొమ్మరిల్లు తో ప్రేక్షకులకు చేరువైయి లవర్ బాయ్ గా ఫేవరేట్ హీరో గా ఎదిగాడు. తెలుగు లో సినిమాలు నుండి దూరం గా ఉన్న చాలా కాలానికి అజయ్ భూపతి దర్శకత్వం లో నిర్మిస్తున్న మహా సముద్రం సినిమాలో హీరో పాత్రలో కనిపించ బోతున్నారు సిదర్థ్. ఈ చిత్రం అక్టోబర్ 14 న రిలీజ్ కానుండగా లాంగ్ గ్యాప్ తర్వాత సిదర్త్ చేతున్న ఈ సినిమా హిట్ కావాలని ఇది తనకు మంచి కంబాక్ సినిమా కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

అదే గాక సమంత మాజీ లవర్ గా ఉన్న తన పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకుల మద్దెలో సమంత విడాకుల తర్వాత చర్చనియంశం గా మారింది. సిదర్థ ఢిల్లీ లో ఉండగా తన పోరుగింట్లో ఉండే మేఘన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వీరికి మోగ్లి ఆమె అబ్బాయి కూడా ఉన్నాడు.
అయితే కొన్ని మనస్పర్థల వల్ల 2007 లో ఈ జంట విడిపోయింది, ఈయన పెళ్లి చేసుకున్నది విడిపోయింది అంతా కూడా సీక్రెట్ గా జరిగి పోయినట్టు అనిపించింది అందుకే చాలా మంది ప్రేక్షకులకు సిదర్థ కి పెళ్లైనట్టు తెలియదు. తర్వాత ఎంతో మంది హీరోయిన్ లతో ప్రేమాయణానికి నడిపారు కానీ ఎవరూ కూడా తనని పెల్లించేసుకోలేదు.
ప్రస్తుతం సమంతను ఉద్దేశించి చేసిన పోస్ట్ వల్ల సిద్దార్థ్ పర్సనల్ జీవితం మళ్ళీ చర్చలోకి వచ్చింది