siddharth-wife-reply-on-samantha

సమంత విడాకుల పై స్పందించిన హీరో సిద్ధార్థ్ భార్య

News

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక తుఫాను సృష్టించిన వార్త నాగ చైతన్య సమంతల విడాకుల విషయం . వారు విడిపోయి కొంత కాలం గడిచిన వారి పైన వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు వారి ప్రస్తావన తీస్తూనే ఉన్నారు. వాళ్లు విడిపోయినప్పటికీ అంటే ఆ తర్వాత వస్తున్నటువంటి వార్తల వల్ల వారు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అని సమంత సన్నిహిత వర్గాలు చెప్తూ ఉన్నాయి, ఎంతో కాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటూ ప్రజల మధ్య తామిద్దరం విడిపోతున్నట్లు అనుమానానికి తావిచ్చి , సరి అయిన క్లారిటీ ఇవ్వకుండా ఈ అనుమానాలకు ఆజ్యం పోసి చివరకు విడిపోయారు. ఎంతో మంది అభిమానించే జంట గా ఉన్న వీరు విడిపోవడం చాలామట్టుకు ప్రజలలో మింగుడుపడని వార్తగా ఉంది.

వీరి విడాకుల విషయం పైన మీడియా వర్గాలు, సన్నిహితులు మరియు సెలబ్రిటీ లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా తమిళ్ హీరో సమంత మాజీ లవర్ అయినా సిద్ధార్థ్ కూడా స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా నాగచైతన్య సమంతలిద్దర్ని చీటర్స్ అంటూ ఒక ట్వీట్ చేశారు ఇప్పుడు అది సంచలనాన్ని సృష్టిస్తోంది.

siddharth-wife-reply-on-samantha

గతంలో సమంత మరియు సిద్ధార్థ లు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు చివరివరకు వచ్చినటువంటి తమ ప్రేమ వ్యవహారం పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి సమంత అంగీకరించకపోవడంతో చివరి నిమిషంలో వాళ్ల పెళ్లి క్యాన్సల్ అయినట్టు మనం గతంలో చూశాం. ఆ తర్వాత ఆ గాయం నుండి కోలుకున్న సిద్ధార్థ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత సమంత-సిద్ధార్థ్ గురించి ఆలోచించక తన కెరియర్ పైన దృష్టి పెట్టి ఒక మంచి స్థాయిని సంపాదించుకున్నారు , ఈ క్రమంలో నాగ చైతన్య గారి తో ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఆ ప్రేమవివాహానికి దారితీసింది.

పెళ్ళై నాలుగు సంవత్సరాల కాకముందే వాళ్ళు విడిపోవడం సంచలనాత్మక వార్త అయితే , సిద్ధార్థ్ సమంతను అభిమానించే వ్యక్తి గనుక మరో కోణంలో దీని అర్థం చేసుకొని ప్రజలలో వీళ్లిద్దరు మోసగాళ్ళు అని పోస్టు పెట్టాడు. ఇంకా ఇదే అంశం పైన సిద్ధార్థ్ భార్య స్పందిస్తూ భార్య భర్తల మధ్య ఎన్నో అభిప్రాయభేదాలు మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఒకరు తగ్గి అవతల వ్యక్తిని అర్థం చేసుకున్నప్పుడు సంసార జీవితము బలంగా ఉంటుందని అలాగా అర్థం చేసుకొని అనేక మంది విడిపోతున్నారు అని అన్నారు.

ఏదైనా అభిప్రాయ బేధం వచ్చినప్పుడు ఇద్దరు ఒకేరీతిగా ఆలోచిస్తే ఆ బంధం బలంగా నిలబడదని, సమంత చేసింది కూడా ఆ విధమైన పొరపాటే అని , ఒక ఆడదాని గా ఆమె తన భర్తకు లోబడి ఉండాల్సింది అని అన్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళు తీసుకున్న నిర్ణయము ఎవరు కూడా ప్రోత్సహించడం దగినది కాదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *