సింగర్ మనో గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈయన ప్రస్తుతం సిని పరిశ్రమలో అన్ని రంగాలలో చాలా బిజీ గ ఉన్న వ్యక్తి ఒక జడ్జ్, ఒక యాంకర్,ఒక సింగర్, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా పాత్రలతో ఎదొక రీతిగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈయన జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహారిస్తునప్పటి నుండి పాపులారిటీ చాలా రెట్లు పెంచేసుకున్నరు. ఈ సందర్భంగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి మనో మరియు ఆయన భార్య ఇన్వైట్ చేయబడ్డారు ఈ సరదా ఇంటర్వ్యూ లో మనో గారు ఎన్నో మనకు తెలియని విషయాలు బయటపెట్టారు.
సింగర్ మనో గారి అసలు పేరు నాగూర్ బాబు అని ఆయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి గ్రామం అని తెలియజేశారు ఈయన ముస్లిం ధర్మానికి చెందినవాడని ఆయన తండ్రి పేరు రసూల్ మరియు తల్లి పేరు షహీద అని చెప్పారు ఆయన తండ్రి ఆలిండియా రేడియోలో పని చేసే వారని మనో గారికి సంగీతం మీద అమితమైన ప్రేమ ఉందని గమనించిన ఆయన తండ్రి మనో గారిని మంచి సంగీత విద్వాంసుడిగా చేయాలని నేదునూరి కృష్ణమూర్తి వద్దకు సంగీతం నేర్చుకొనుటకు పంపించేవాడు అని తెలియ చేస్తూ.
తన కెరియర్ లో మొదటి అనుభవాన్ని గురించి మనో గారు ఈ విధంగా చెప్పుకొచ్చారు తన కెరియర్ మొదట్లో ఇళయరాజా గారితో పని చేయాల్సి వచ్చిందని ఇళయరాజా గారు మనో గారితో మంచి పాటలు పాడించే వాడని ఇళయరాజాకు మనో గారికి ఉన్నటువంటి సాంగత్యం మూలానా నాగూర్ బాబు గా ఉన్న ఆయన పేరును మనో గా ఇళయరాజా గారేనని అలాగే చక్రవర్తి గారి దగ్గర శిష్యుడిగా చేర్పించింది కూడా ఆయనేనని తెలియజేశారు.
మనో గారి పాటలు పాడే విధానం లో ఉన్న తేట తెలుగుకు చక్రవర్తి గారు ముగ్ధుడై ఆయన అసిస్టెంట్గా మనో గారిని నియమించుకున్నారు. ఆ తరువాత మనో గారు కొన్ని చలన చిత్రాల్లో కూడా నటించాడు మొదట్లో సినిమా టైటిల్స్లో ఈయన పేరు మనో గా మార్చినప్పటికీ నాగూర్ బాబు గానే కనిపించేది తర్వాతి కాలంలో మనో గా ఆయన పేరు టైటిల్స్ లో వేయడం ప్రారంభం అయింది.

ఆయన చక్రవర్తి గారి దగ్గర ఉన్నప్పుడు సహాయకుడిగా మరియు మంచి గాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆనాటి హీరో మురళి మోహన్ గారు నటించిన కర్పూర దీపం లో గాయకుడిగ పరిచయమైన మనో గారు మళ్ళీ తిరిగి చూడలేనంత బిజీగా మారారు ఇదే సమయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ సందర్భాలలో సుమారు 25 వేలకు పైగా పాటలను ఆయన ఆలపించారు కేవలం తెలుగు భాషలో మాత్రమే కాక భారతదేశంలోని సుమారు 11 భాషలలో ఆయన పాటలు పాడారు అని తెలియ జేశారు. ఇదే సమయంలో ఆయన ఒక మంచి నటుడిగా మరియు మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా గుర్తింపు పొందుతున్నారు
మరో గారు 1985లో ఆయనకు 19 సంవత్సరాల వయసులో జామిల గారితో వివాహం జరిగిందని తెలియజేశారు ఆయన వివాహములో సాక్షి సంతకం చేయడం విషయంలో ఇళయరాజా మరియు చక్రవర్తి గారు సంతకాలు చేశారని చెప్పుకొచ్చారు . మనో గారు తన సంతానాన్ని గురించి ఈ రకంగా చెప్పుకొచ్చారు ఆయనకు ముగ్గురు కుమారులని ఒక కూతురు అని ముగ్గురు కుమారులలో ఒక కుమారుడు తనకు నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే ప్రమాదవశాత్తు మరణించాడు అని తెలియజేశారు.

ఇప్పుడు మనో గారి పెద్ద కుమారుడు తమిళ సినీ పరిశ్రమలో నటిస్తున్నాడని రెండవ కుమారుడు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని మరియు అమ్మాయి అమెరికా దేశంలో ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే స్వరాభిషేకం ప్రోగ్రాంలో పాటలు పాడుతూ తన స్వరాన్ని అంతర్జాతీయంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు వినిపిస్తుందని తెలియజేశారు త్వరలో తన కూతురు తెలుగు సినిమాల్లో పాటలు పాడబోతుంది అని తెలియజేశారు.

అయితే ఆయన ముస్లిం ధర్మానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ హిందూ ధర్మం లో ఉన్నటువంటి ఆచారాలకు విలువలు ఇస్తానని ఎన్నోసార్లు హిందూ ధర్మ క్షేత్రాలను దర్శించుకునాను అని తెలియజేశారు తాజాగా ఆయన తిరుపతికి పలుమార్లు కాలినడక వెళ్లానని తెలియజేశారు. ఈ షోలో మనో గారి భార్య మాట్లాడుతూ మా వారినీ ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును అందజేస్తే చాలా సంతోషిస్తానని అన్నారు