Singham 2 villain Danny

డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సింగం 2 విల్లన్ డ్యాని.

News

భారత చిత్ర పరిశ్రమకు డ్రగ్స్ సప్లై చేసేది కూడా అతనే అని పోలీసుల అనుమానం. గత కొంత కాలం గా చిత్ర పరిశ్రమను డ్రగ్స్ భూతం పట్టి పీడిస్తుంది. ప్రతి ఇండస్ట్రీ లో కొంతమంది నటులు డ్రగ్స్ తీసుకుంటున్నారనే వాదన గొప్పగా హైలెట్ అయ్యింది. ఈ విషయం పైన భారత ప్రభుత్వం సదరు నటులకు టెస్టులు చేసి వాళ్లకు డ్రగ్స్ ఎలా లభ్యమవుతున్నాయి తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ తంతును మనము గత కొన్ని సంవత్సరాలుగా టీవీలో చూస్తూనే ఉన్నాము.

అయితే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో ఆఫ్రికాకు చెందిన కొంతమంది ముఠాలు నివాసం ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్నారని అనుమానంతో అరెస్టు అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఈ లిస్ట్ లోకి సింగం 2 సినిమా లో డ్యాని పాత్ర పోషించిన ఆఫ్రికన్ నటుడు చెక్వుమే మాల్విన్ సింగం 2 సినిమాలో తాను డ్రగ్స్ సప్లయర్గా పోషించిన పాత్ర నిజ జీవితంలో కూడా పోషించి డ్రగ్స్ అమ్ముతున్న కేసులో పట్టుబడ్డాడు.

పోలీసుల విచారణ ప్రకారము మెడికల్ వీసా మీద ఇండియాకు వచ్చి కర్ణాటకలోని కేఆర్ పురం కు సమీపంగా ఉన్న బట్టరహల్లి లో ఉంటూ కస్టమర్లకు డ్రక్స్ అమ్ముతున్న టు పేర్కొన్నారు. ఆయన నుండి సుమారు ఎనిమిది లక్షలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు వాటిలో 15 గ్రాముల మరియు 250 గ్రాముల హాశిష్ శైలం ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ నటుడు ఈ డ్రగ్స్ రాకెట్ ని ఎన్ని ప్రాంతాలలో నడుపుతున్నాడు అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు ఆ నటుడికి ముంబై హైదరాబాద్ ఢిల్లీ చెన్నై బెంగళూర్ వంటి ప్రాంతాలలో తనకున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

Singham 2 villain Danny

వృత్తిపరంగా మెల్విన్ చాలా ఆసక్తితో బజ్యతగా ఉండేవాడు తాను సినిమా పరిశ్రమలో నటించడానికి ఎంతో కష్టపడ్డాడు ఆ కష్టమే అతని ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేసింది.

న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసుకున్న మెల్విన్ ప్రారంభంలో నైజీరియన్ సినిమాలలో నటించాడు ఆ తర్వాత అతని క్యాతి ఖండాలు దాటి భారతదేశ చిత్ర పరిశ్రమను ఆకట్టుకుంది తద్వారా హీరో సూర్య నటించిన తమిళ బ్లాక్ బాస్టర్ అయినా సింగం-2లో విలన్ పాత్ర పోషించడానికి అవకాశం దక్కించుకున్నాడు.

ఆ తర్వాత భారతదేశంలో ఉన్న అనేక చిత్రపరిశ్రమలో నుండి వరుసగా ఆఫర్లు అందుకుంటూ భారత దేశం లోని సుమారు ఇరవై భాషల సినిమాలలో నటించాడు. కన్నడ భాషలో అన్నా బాండ్ మరియు పరమాత్మ సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించిన ఈయన కర్ణాటకలోనే ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్న కేస్ లో సెప్టెంబర్ 27 న బట్రహల్లి లో పట్టు బడ్డాడు.

అయితే ఇదంతా కూడా చతికిలపడిన తన పరిస్థితిని బాగు చేసుకోవడానికి చేశాను అంటున్నాడు మల్విన్. కరోణ గడ్డు కాలం తర్వాత తనకు ఆఫర్లు లేకుండా పోయాయని కనీసం తన వ్యక్తిగత అవసరాలు కూడా తీర్చుకోలేనంతా క్లిష్ట పరిస్థితిలో తానున్నానని అందుకే ఈ పని చేయటనికి ఒప్పుకున్నట్టు తెలిపాడు. కర్ణాటక పోలీసులు ఈయనపై నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద ఆయనను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *