ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఎదురుచూసే టీవీ షోలలో ఒకటి బిగ్ బాస్ , ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 82 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ముగింపు దశకు చేరుకుంది.
ఇక త్వరలో బిగ్ బాస్ షో ముగియనుండగా ప్రతి సీజన్లో లాగా ఇంట్లో కంటెస్టెంట్ లు తమ అయిన వారిని విడిచి సుమారు 80 రోజులు అవుతుండగా ఒక్కొక్క కంటెస్టెంట్ తమ సొంతవారిని ,తల్లిదండ్రులను , పిల్లలను లేదా స్నేహితులను కలుసుకునే అవకాశం బిగ్ బాస్ ఈ సీజన్లో కూడా కల్పించాడు.
ఈ క్రమంలో బుధవారం రోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో అందరికంటే ముందుగా ఆర్ జె కాజల్ కుటుంబ సభ్యుల నుండి ఆమె భర్త మరియు కుమార్తెను బిగ్ బాస్ ఇంటిలోనికి పంపించారు. వాళ్లను చూసిన మిగితా ఇంటి సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు, ఇక ఆ రోజు చాలా సమయం కాజల్ భర్త ఇంటి సభ్యులతో గడిపి మంచి సూచనలు ఇచ్చారు ఎపిసోడ్ పూర్తి అయే సమయానికి బిగ్ బాస్ కాజల్ భర్తకు సమయం అయిపోయింది అని తెలియజేయడంతో ఆయన గేటు గుండా వెళ్ళిపోయారు.
దాంతో ఆ రోజు ఎపిసోడ్ ముగిసింది ఇక మరుసటి రోజు ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ గురించి బిగ్ బాస్ మూడు ప్రమొలను రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రోమోలు సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బిగ్ బాస్ విడుదల చేసిన మొదటి ప్రోమో ప్రకారం మానస్ తల్లి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అటు వైపు తిరిగి ఉన్న మానేస్ను వెనక నుండి హత్తుకుంది, ఆ తర్వాత ఇంట్లోనే ప్రతి సభ్యుని పలకరించి సరదా వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆమె ఉన్నంతసేపు ఇంట్లోనీ సభ్యులందరితో ఇంటరాక్ట్ అవుతూ అందరి మనసులను తేలిక పరిచింది.
ఇక మానస్ కు ప్రత్యర్థిగా పోటీపడుతున్న శ్రీరామ్ ను పలకరించి సరదాగా మాట్లాడింది. ఈ ప్రోమో చూసిన నెటిజనులు మనస్ తల్లి ని ఒక అద్భుతమైన శక్తి అని వర్ణిస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక రెండవ ప్రోమో ప్రకారం బిగ్ బాస్ శ్రీరామ్ సహోదరిని ఇంట్లోకి పంపించాడు శ్రీరామ్ తన సహోదరి పట్ల తన అమితమైన ప్రేమను వ్యక్తం చేశాడు అదేసమయంలో తన నానమ్మ యోగక్షేమాలను గురించి ఆరా తీశాడు ఆ తర్వాత అందరి అన్నయ్యా లలాగానే తన చెల్లిని ఆటపట్టిస్తూ కనిపించాడు.
ఇక బిగ్బాస్ చివరగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం సిరి తల్లిని బిగ్ బాస్ ఇంటిలోకి పంపించాడు. ఆమె వచ్చి రాగానే తన కూతురిని కౌగిలించుకొని మరుక్షణమే షణ్ముఖ్ కు వార్నింగ్ ఇచ్చింది. నా కూతురిని నువ్వు కౌగిలించుకోవడం నాకు నచ్చట్లేదు అంటూ సీరియస్ అయింది. ఇదే ఈ ప్రోమో లో హైలెట్ సీన్.

మళ్లీ వెంటనే నువ్వు నా కూతురికి మంచి సపోర్ట్ ఇస్తున్నావ్ అంటూ మాట కలిపింది. కానీ షణ్ముఖ్ మాత్రం సిరి తల్లి మాట్లాడుతున్నంత సేపు నిరుత్సాహంగా మౌనంగా కనిపించాడు. ఇక ఈ ప్రోమో మిగతా ప్రోమోల కంటే ఎక్కువ గా ఆకర్షణ ను సంపాదించుకుంది దీంతో ఆ రోజు సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. అయితే కొంతమంది నెటిజనుల అంచనాల ప్రకారం సిరి తల్లి అన్న ఈ మాటలు షణ్ముఖ గ్రాఫ్ ను ఖచ్చితంగా దెబ్బతీస్తాయి అంటున్నారు. ఆమె మాటల వల్ల చివరి కంటెస్టెంట్ లలో ఉండబోయే షణ్ముక్ కు గట్టి డ్యామేజ్ కలగ బోతుంది అని అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి కెప్టెన్ షణ్ముఖ్ అవడంతో ఏదైనా మార్పు జరగవచ్చు అని అని ఆలోచనలో కూడా ఉన్నారు.