sonu sood

జనాలు నిన్ను దేవుడు అని ఊరికే అనరు సోను గారు..హైదరాబాద్ లో ఓ పేద వ్యాపారి కోసం జ్యూస్ అమ్మిన సోను సూద్.!

News Trending

ఈ కరోనా కష్టకాలంలో ఎంతో మందికి చేయుతనిస్తూ ప్రజలకు అంతకంతకూ దగ్గరవుతున్నాడు సోను సూద్.ఎంతో మంది హీరోలు మన చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ సోను సూదే ప్రజల పాలిట రియల్ హీరో గా మారి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టాడు.అసలు సినిమాల్లో విలన్ రోల్స్ చేసే సోను సూదు మనసులు ఇంత మంచిదా అని ఎవరు ఊహించలేదు. తనని సహాయం కోసం అడిగిన ప్రతీ ఒక్కరికీ తప్పకుండా సహాయం అందిస్తుంటాడు సోను గారు. అయితే ఇటీవలే అతను హైదరాబాద్ నగరంలో ఒక పేద వ్యాపారి జ్యూస్ స్టాల్ లో కి వెళ్లి జ్యూస్ ని అమ్మి ఉచ్చితంగా ఆ పేద వ్యాపారి కి ప్రమోషన్ ఇచ్చాడు.

 

ఈ కాలం లో సెలబ్రిటీ స్థానం ఒక వ్యాపారం లాగా అయిపోయింది. కానీ వాళ్ళు అనుకుంటే ఎంతో మందికి ఎలాగైనా సహాయం చేయవచ్చు. అయితే చాలా మంది ఒక సెలెబ్రిటీ తలుచుకుంటే ఎంత మంది జీవితాలైన బాగుపడతాయి అని చాలా సార్లు నిరూపించారు కూడా. ఇక సోను సూద్ గారు కూడా మొదట్లో తన సొంత డబ్బుతో సహాయ కార్యక్రమాలు చేసి తరువాత ఈ మంచి పనిలో ఇతరులకు కూడా భాగస్వామ్యం కలిగిస్తున్నాడు.

అయితే సోను సూద్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఉండే అభిమానులు తనకు విరాళాలు పంపుతున్నారు. అదేంటో పీఎం రిలీఫ్ ఫండ్ కంటే జనాలు సోను సూద్ రిలీఫ్ ఫండ్ నే విశ్వసిస్తున్నారు. అతనికి ఇస్తే కచ్చితంగా వారి డబ్బు కావాల్సిన వారికే నేరుగా చేరుకుంటుంది అని వారి నమ్మకం. అయితే సోను సూద్ ఏ సహాయ కార్యక్రమం చేసిన అది నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. అయిన కూడా సోను సూద్ ఒక సామాన్య వ్యక్తి లాగా అందరి దగ్గరికి వెళ్లి వారి అవసరాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఇటీవలే సోను సూద్ హైదరాబాద్ లో ఒక పేద వ్యాపారి జ్యూస్ స్టాల్ దగ్గరికి వెళ్లి ఉచ్చితంగా అతని జ్యూస్ అమ్మి తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసాడు.

హైదరాబాద్ సిటీ తనకు సెకండ్ హోమ్ అని చాలాసార్లు చెప్పిన సోనూసూద్ గతంలో ఓ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లి దానికి గిరాకీ బాగా వచ్చేలా చేశాడు. సోనూసూద్ బ్రాండ్ ఆ వ్యాపారికి చాలా సహాయపడింది. అయితే ఇటీవల బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ 2లో ఓ ఫ్రూట్ జ్యూస్ స్టాల్ దగ్గరకు వెళ్లి స్వయంగా మొసంబి రసాన్ని తయారు చేసి అమ్మి ఆ వ్యాపారికి సపోర్ట్ చేసాడు. ఈ జ్యూస్ లో మనకు అవసరమైన విటమిన్ c ఉంటుంది కాబట్టి ఎలాంటి జ్యూస్లు తరచుగా తాగి ఆరోగ్యనన్ని కాపాడుకుంటూ ఇలాంటి చిన్న చిన్న వాపారులకు సహాయం చేయండి అంటూ మెసేజ్ ఇచ్చారు.

సాధారణంగా సెలెబ్రెటీలు పెద్ద వ్యాపారాలకు ప్రమోషన్ కోసం ఎక్కువ మొత్తంలో ఫీజు తీసుకుంటారు. అయితే నటుడు సోనూసూద్ మాత్రం ఎలాంటి ఫీజు ఆశించకుండా ఇలాంటి చిన్న వ్యాపారులకు కూడా సపోర్టు ఇవ్వండి అంటూ ప్రమోషన్ చేస్తున్నాడు. అయితే టాలీవుడ్ లో వరుస ఆఫర్ లతో బిజీ గా ఉండడం మూలంగా అతను హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ ఇంటిని కొన్నాడు.ఈ నటుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published.