Sonu Sood

సంవత్సరం వయసున్న చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో సోను సూద్..మరోసారి తన గొప్పతనం చాటుకున్నాడు…

Movie Review

పేషెంట్ ఎవరైనా ఏ ప్రాంతపు వారైనా సహాయం అని అడిగినప్పుడు లేదు అనకుండా తక్షణమే సహాయం అందిస్తాడు అంటూ భారత దేశం మొత్తంలో ప్రతి వ్యక్తి కి ఒక నమ్మకాన్ని కలిగించాడు మన సోను సూద్.

నిజమే ఇంతటి అతి భయంకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే ఏ దేశం లో అయిన ప్రజలు సహాయం చేయమని ఆ దేశ ప్రధానిని గాని లేదా ప్రెసిడెంట్ ని గాని అడుగుతారు. కానీ మన దేశంలో మాత్రం కష్టం వస్తే రాజకీయ నాయకులు గుర్తు రావట్లేదు, ప్రధాని , ప్రెసిడెంట్ ల పేర్లు ఎప్పుడో మర్చిపోయారు.

ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్య అయిన ఎలాంటి అవసరమైన ప్రజలు ఒకే వ్యక్తి ని అడుగుతున్నారు.అడగడం మాత్రమే కాదు అడిగింది పొందుకుంటున్నారు.కాబట్టి ప్రాణాలు నిలబెట్టే సోను సూదే కావాలంటున్నారు ప్రజలు.కొంత మంది సోను సూద్ విగ్రహానికి పూజలు చేస్తున్న వీడియోస్ కూడా ఇదివరకే టీవీ చానెల్స్ లో చాలానే చూసాం.

నిజమే కదా? ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పనిని సోను సూద్ తన పై వేసుకొని ఒక టీం ను ఏర్పాటు చేసుకొని సహాయం అన్న ప్రతీ వారికి చేయుతనివ్వడం అంటే మాములు విషయం కాదు.విరాళాలు పీఎం కేర్ కి కాదు సోను సూద్ అకౌంట్ కు పంపండి అనేంత స్థాయికి సోను సూద్ పై ప్రజల నమ్మకం చేరుకుంది.ఇప్పటికే సోను సూద్ ద్వారా సహాయం పొందుకున్నవారు కొన్ని వేళల్లో ఉన్నారు, ఇది మనకు తెలియని విషయం ఏం కాదు.

అయితే తాజాగా సోను సూద్ తెలంగాణా కు చెందున ఏడాది వయస్సున్న ఒక చిన్న బాబుకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించి ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టాడు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

పుట్టుకతోనే గుండె జబ్బుతో పుట్టిన ఒక చిన్నారి ప్రాణాలు సోను సూద్ కాపాడాడు.తెలంగాణా లోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అన్నలురెడ్డి పల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన భాస్కరరావు అతని భార్య సత్యలకు ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు.అతని పేరు తేజాకృష్ణ.

అయితే భాస్కరరావు కుంటుంబ పోషణ కోసం ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు. అతని కుమారుడికి ఆపరేషన్ తప్పకుండ చెయ్యాలని లేకపోతే బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్పారు.దాంతో ఏం చెయ్యాలో తెలియని తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను చూసిన జన విజ్ఞానవేధిక సభ్యులు ఈ విషయాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి దాతలు ముందుకు రావాలి కోరారు.అయితే ఈ పోస్ట్ సోను సూద్ కంట పడింది వెంటనే తల్లిదండ్రులకు చిన్నారిని ముంబై తీసుకురమ్మని సమాచారం పంపించాడు.

వారు ముంబై చేరుకోగానే ఆ చిన్నారికి ఎస్ ఆర్ సి సి పిల్లల హాస్పిటల్ లో గురువారం రోజున ఆపరేషన్ చేసారు డాక్టర్లు. ఇప్పుడు చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు.
సోను సూద్ చేసిన ఈ సహాయానికి నెటిజన్లు మరోసారి హర్షం వ్యక్తం చేస్తూ సోను సూద్ రియల్ హీరో అంటూ పోస్టులు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు.చిన్నారి కుటుంబ సభ్యులు,బంధువులు అందరూ ఈ సహాయాన్ని ఎప్పటికి మర్చిపోలేం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *