20కోట్ల tax పన్ను ఎగవేశారు మూడు రోజుల సోదాల్లో గుర్తించినట్లు వెల్లడి

News

ప్రముఖ నటుడు అనగా సినిమాలలో విలన్ మరియు సైడ్ కారెక్టర్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన సోనూసూద్, సినిమాలో కన్నా కరోన కాస్ట సమయం లో ఎంతో మంది నిరాశ్రయులకు, నీరు పేదలకు గొప్ప సహాయం చేసి ప్రజలకు మరింత దెగ్గరయ్యారు, అయితే సోను సూద్ గారు 20 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేసినట్లు ఈ శనివారం రోజున ఆదాయపన్ను(Income tax) వెల్లడించింది.

అయితే ఇటీవల ఐటీ విభాగం సోనూసూద్ గారి ఇళ్లు మరియు కార్యాలయాల్లోను సోదాలు నిర్వహించారు. నిన్నటి వరకు అంటే మూడురోజుల పాటు ఈ సోదాలు జరిపారు. పన్ను ఎగవేసిన ఆరోపణలతో, అధికారులు ఆయన యొక్క ఆర్థిక లావాదేవీలను పరిశీలించారట.

అలాగే సోనూసూద్ గారు ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్‌ ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు తెలుపుతున్నారు. క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2 కోట్ల 10 లక్షలు సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్‌తో పాటు ఆయన యొక్క సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు అధికారులు తెలియ జేశారు.

కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లడిస్తున్న సమయం లో సోను సుద్ గారు ఆయన చాలా సహాయమూ చేశారు అందరికి  మన సోనూసూద్ అనిపించుకున్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల గుండెల్లో గొప్ప స్థాయిలో నిలిచిపోయారు. కాగా, ఫస్ట్ వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన హెల్పింగ్ సంస్థ 18 కోట్ల రూపాయలకు పైగా విరాళాలను సేకరించిందని ఐటీ అధికారులు వెల్లడించారు.

sonu sood
sonu sood

అందులో రూ.1 కోట్లు 90 లక్షలు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, ఇక మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని అధికారులు తెలియజేసారు.

విద్యార్థులకు మార్గం చూయించే ఉద్దేశంతో రూపొందించినటువంటి కార్యక్రమానికి దిల్లీ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది అని అందరికి తెలిసిందే. ఈ సమయం లొనే ఐటీ శాఖ సోదాలు జరపడంపై దిల్లీ అధికార ప్రభుత్వం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ మరియు శివసేన పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఎందుకంటే సోనూసూద్ తాము చెయ్యని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడని భాజపా తట్టుకోలేక ఇలాంటి ఐటీ దాడులు చేస్తుందని వారి ఆరోపణ, ముఖ్యం గా మహారాష్ట్ర అధికార పార్టీ అయిన శివ సేన పార్టీ భాజపా చేసే ప్రతి పనిని నిలదిస్తూ ఉంటుంది, కానీ భాజపా మాత్రం ఆరోపణలను కొట్టిపారేసింది. భాజపా గత కొద్ది కాలం గా తమను వ్యతిరేకించే వారి పై ఐటీ దాడులు చేస్తున్నాట్టు గా నెటీజనులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ ఐటీ దాడుల పై సోను సూద్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.