సోనూసూద్ గత ఏడాదిన్నర కాలంగా వార్తల్లో ఉన్నారు, కరోనా కష్ట కాలంలో ఎటు వెళ్ళాలో తోచని వలస కార్మికులను బస్సులు ఏర్పాటు చేసి తమ ఇళ్లకు చేర్చాడు. అదే రీతిగా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి విమానాలు కూడా ఏర్పాటు చేసి తమ గమ్యనికి చేర్చాడు, ఇవే గాక ఇంకా అనేకమైన సహాయ చర్యలు చేశాడు మరియు కోరోనా సెకండ్ వేవ్ ప్రబలినప్పుడు ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది మరణిస్తు ఉండగ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆక్సీజన్ ప్లాంట్లు నిర్మించాడు . ప్రభుత్వం చేయనటువంటి గొప్ప పనులు సోనుసూద్ చేసి చూపించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు.
ఇలా కష్టకాలంలో ఆదుకొన్న సోను సూద్ ని తమ దేవుని గా ఎంతో మంది భావిస్తున్నారు. ఆయన పైన అభిమానంతో గతంలో మన తెలుగు వాడు ఆయనను కల్సుకోటానికి ముంబై లోని తన గృహం వరకు నడ్చుకుంటు వెళ్ళాడు మరియు తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అభిమాని తనకు గుడి కట్టించడం ప్రారంభించాడు ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామనికి చెందిన వెంకటేశ్ సోను సూద్ ను కంటికి కనపడే దేవుడిగా భావించి సోనూసూద్ విగ్రహ ఏర్పాటుకు రూపకల్పనకు పూనుకున్నాడు , తన సొంత ఖర్చుతో రియల్ స్టార్ సోనుసూద్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న వెంకటేష్ కు వచ్చిన ఆలోచనకు సంతోషించిన గ్రామస్తులందరూ అతనిని అభినందించారు.
వెంకటేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సోనుసూద్ మీద అమితమైన ప్రేమ పెంచుకున్నాడు.. అందుకే అభిమానంతో విగ్రహ ఏర్పాటుకు పూనుకున్ననాని తెలియజేశాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని గొల్లపూడి లో విగ్రహాన్ని చేయించి అక్కడ నుండి ఆటోలో తన గ్రామానికి తీసుకువచ్చాడు.
కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలు చేయలేని పనులు సోనూసూద్ ఒక్కడు చేసి చూపించ్చాడని నిరుపేదలకు సాయం అందించడంలో సోనూ చేసిన ఘనతను గ్రామస్తులు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు , . దూరప్రాంతాలకు వెళ్లే వారినీ తన సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి పంపించి, నిరుపేదలకు అండగా ఉండడం వంటి పలు కార్యక్రమాలు చేయడంలో సోనుసూద్ కు సాటి ఎవరు ఉండరని వెంకటేష్ చెబుతున్నారు.
సోనూసూద్ మనిషి రూపంలో వచ్చిన దేవుడిగా భావించి ఆయన పైన ఉన్న ప్రేమ అభిమానాలతో తన ఊర్లో , ఆ దేవుని విగ్రహం ఉండాలని ఏర్పాటు చేస్తున్నానని వెంకటేష్ పేర్కొన్నాడు.విగ్రహ ఆవిష్కరణ కోసం వెంకటేష్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు .. దీని కోసం తన దేవుడు సోను సూద్‌ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు. అదే కాకుండా గుడి నిర్మించి సోనూ విగ్రహానికి నిత్య పూజలు అందిస్తానని కూడా వెంకటేష్ వెళ్ళడించాడు .మరి సోను సూద్ ఈ భక్తుడి కోరికను నెరవేరుస్తాడా అనేది చూడాలి.