బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ న్ డ్రగ్స్ కేసులో శనివారం ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన కేసులో ఎన్‌సిబి అధికారులు ఆర్యన్ మరియు అనేక మందిని అరెస్టు చేశారు. ఆర్యన్ ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు NCB అదుపులో ఉన్నాడు. అయితే, ఈ విషయంలో సల్మాన్ ఖాన్ , సునీల్ శెట్టి , పూజ భట్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు షారూఖ్‌కు తమ మద్దతును తెలిపారు.
తాజాగా, సోనూ సూద్ మరియు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ లు కూడా షారూఖ్‌కు తమ మద్దతును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నపటికి కోర్టు దానిని తోసిపుచ్చి అక్టోబర్ 7 వరకు ఆర్యన్ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. ఈ క్రమంలో సోనూ సూద్ .. ఆర్యన్ పేరును ప్రస్తావించకుండా ఒక ట్వీట్ చేశారు. “పిల్లలు విలువైనవారు… వాస్తవాలు బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది,అప్పుడే పరిస్థితిని దేవుడిలా మీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఇటువంటి క్లిష్ట సమయంలో మనం ఒకరికొకరు సహాయంగా ఉండాలి, ”అని ఆయన రాశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.
సోనూసూద్, ఆర్యన్ ఖాన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసారని నెటిజన్లు ఫిక్సయ్యారు. సోనూ సూద్ 23 ఏళ్ల ఆర్యన్ నీకు చిన్న బిడ్డల ఎలా కనిపించాడు. సచిన్, కపిల్ దేవ్ మరియు నీరజ్ చోప్రా 23 సంవత్సరాల వయస్సులోనే చాలా గొప్ప పనులు చేసి మరో కొంత మందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్యన్ ఎంటో అని మాకు తెలుసు .. 23 సంవత్సరాల వయస్సులో, రేవ్ పార్టీలకు వెళ్లిన ఆర్యన్‌ను మంచి వ్యక్తిగా చూపించే ప్రయత్నాన్ని నమ్మడానికి ప్రజలు అంత పిచ్చివాళ్లు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
बच्चे बहुमूल्य होते हैं
सत्य तो सामने आने में समय लगता है।
ख़ुद भगवान न बनें,
समय को समय दें,
यह समय है, चेहरे याद रखता है।— sonu sood (@SonuSood) October 4, 2021
మరియు ఋతిక్ రోషన్ మాజీ భార్య కూడా ఈ సమయంలో స్పందిస్తూ ఆర్యన్ ఖాన్ చాలా మంచి అబ్బాయి, కానీ ఇలాంటి ఈ పరిస్థితుల్లో తాను ఇరుక్కుంటాడు అని అనుకోలేదు. బహుశా డ్రగ్స్ తీసుకుంటున్న పార్టీలో షారుక్ ఖాన్ కొడుకు ఉండవచ్చు అంటూ తన మద్దతు ఎల్లప్పుడూ షారుఖ్ మరియు గౌరీ లకు ఉంటుందని తెలియజేశారు.