సౌందర్య బయో పిక్ రాబోతుందట. మరి సౌందర్యగా చేసేది ఎవరంటే….

News

కొంత కలం కిందట ఇండియాలో సంచలనం సృష్టించిన కొంతమంది యాక్టర్లు బెంగళూరు నుండి వచ్చిన వాళ్ళే. ముఖ్యంగా చెప్పాలంటే ఐశ్వర్యరాయ్ సౌందర్య లాంటి వారు బెంగళూరు నుంచి వచ్చారు మరియు ఇప్పటికీ కూడా బెంగళూరు ప్రాంతంలో మంచి సినిమా ట్రైనింగ్ కాలేజీ లు ఉన్నాయి. అవి ఎన్నో నూతన టాలెంట్లను మనకు పరిచయం చేస్తు ఉనాయి ఆ విదంగ వచ్చిన బ్యూటీ రాష్మిక మందన.

తెలుగు క్లాసికల్ సినిమాల గురించి ఆలోచిస్తే బెంగళూరు బ్యూటీ అలాగే మన తెలుగు సినీ పరిశ్రమను దశాబ్దకాలంపాటు ఏలిన వారు సౌందర్య . ఆమె సినిమాలు చేస్తున్న కాలంలో చిన్న పిల్లవాడి నుండి పెద్దవారి వరకు ఆమెను ఎంతో అభిమానించేవారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెతో చిన్న నుండి పెద్ద వారి వరకు ప్రేమలో పడ్డారు..
ఆమె అనుకోని మరణము ఆమెను మనకు దూరం చేసింది కాని ఆమె ఒకవేళ బ్రతికి ఉన్నటైతే నేటికి కూడా గొప్ప సినిమాలు .చేసేది అని బలమైన విశ్వాసం ప్రజలలో ఉంది ఆమె లేని లోటు తీర్చే హీరోయిన్ ఇంతవరకు ఎవరు తెర్చలేక పోయారు అయితే ఈ మద్య కలం లో తెర పైన మెరుస్తున్న కన్నడ బ్యూటీ రాష్మిక మంధన తనకు సౌందర్య పట్ల ఉన్న అబిమానాన్ని తెలియచేసారు.

తనను తన బాల్యంలో నువ్వు సౌందర్య లాగా ఉంటావని తన కుటుంబ సభ్యులు అంటుండేవారు అని . దీంతో సౌందర్య కు అభిమానిగా ఫిక్స్ అయిపోయానని . ఈ ప్రేరణ తనను మోడల్ గా చేసిందని తెలిపారు సౌందర్య అనే పదంతో తనకు సినిమాలు అంటే మంచి అభిప్రాయం కలిగింది అని తాను కూడా ఒక నటిగా చూసుకోవాలని ప్రేరణ పొందారు అని చెప్పారు.

soundarya Photo
soundarya

ఈ నేపద్యంలో రాష్మిక మంచి యాక్టర్ గా కన్నడ సినిమలోకానికి పరిచయం అయ్యారు 2016 లో కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాలో చేసి చలో సినిమా ద్వార తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రాష్మిక తెలుగు బాషలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు విజయ దేవర కొండ తో నటించిన గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్ ద్వార ఉత్తర మరియు దక్షిణ బారతీయ ప్రేక్షకుల మనసును గెల్చుకున్నారు.

ఈ సినిమాలతో వీరి జోడి సూపర్ హిట్ అయ్యింది ఈ సక్సెస్ తో రాష్మికాకు రక రకాల పరిశ్రమల నుండి ఆఫర్ల తో ఫుల్ బిజీ గ మారారు తాజాగా బాలీవుడ్ ర్యాపర్ బాద్ ష తో చేసిన ప్రైవేటు సాంగ్ వైరల్ గ మారింది. ప్రస్తుతము సుకుమార్ నిర్మిస్తున్న పుష్ప సినిమాలో రాష్మిక హీరోయిన్ గ ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమాలో రాష్మిక ఒక పల్లెటూరి పిల్లల మనకు కనిపించ బోతున్నారు.

మరియు తెలుగు మరియు కన్నడ క్లాసికల్ సినిమా ప్రపంచాన్ని 12 సంవత్సరాలుగా అగ్రనటిగా ఏలిన సౌందర్య పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ చాలా బిజీగా కనిపించేది ఆమె యొక్క సక్సెస్ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అన్నారు.

Soundarya Pic

తనకు ఉన్న అభిమానం మూలంగా సౌందర్యను మరొకసారి తెరమీద చూడాలనె ఆశ ఉన్నదని రష్మిక మందన అన్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఏ యాక్టర్ కైనా తమ జీవితంలో సక్సెస్ సంపాదిస్తున్న కొలది దూరదృష్టి అనేది ఉంటుంది అని తనకు కూడా దూర దృష్టి కలిగి ఉందని తెలియ చేసారు.

అయితే ప్రస్తుత కాలంలో బయోపిక్ ట్రెండ్ కొనసాగుతూ ఉండటం మూలంగా తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలిన సౌందర్య బయోపిక్ చేయాలనే కల తనకు ఉందని త్వరలో ఆ కలను నిజం చేసుకొన టానికి ప్రయత్నిస్తానని తెలియజేశారు.

సౌందర్యకు తాను ఒక గొప్ప అబిమాని అని అభిమానులకు సౌందర్యను మరొక్కసారి తేరా పైన చూడాలని ఉందని ఆ కోరిక తనవల్ల తీరితే ఒక వరం గ బావిస్తాను అని తన అబిప్రాయం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *