కార్తీక దీపం : మోనిత ఉంటేనే మూడ్ ఉంటదా .? అంటూ కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు పరువు తీసిన శ్రీముఖి.!

News

తాజాగా స్టార్ మా ఛానల్ లో పరివార్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రాం ప్రసారమవుతున్నసంగతి తెలిసిందే. అయితే ఇందులో మా టివి లో ప్రసారం అయ్యే సీరియల్స్ లో ఉండే సభ్యులు అందరూ పలుగొంటున్నారు. అంతేకాకుండా వారి అదరగొట్టే పర్ఫర్మ్యాన్స్ తో అందరిని చాల బాగా ఆకట్టుకుంటున్నారు కూడా.

పాటలు పాడుతూ డాన్సులు హంగామా చేస్తున్నారు. ఇందులో యాంకర్లు శ్రీముఖి మరియు సుమ గార్లు వారి కామెడీ పంచులతో అందరిని తెగ నవ్విస్తున్నారు కూడా. ఇదిలా ఉండగా శ్రీముఖి కార్తీక దీపం సీరియల్ టీం తో ఒక ఆట ఆడుకున్నారు.ఈ కార్యక్రమంలో కార్తీక్, మోనిత, భాగ్యం కనిపించినప్పటికీ కార్తీక దీపం ఫేమ్ వంటలక్క మాత్రం ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ షో లో యాంకర్ శ్రీముఖి డాక్టర్ బాబు కి చుక్కలు చూపించింది. మోనిత రాకపోతే మూడ్ రాదా అంటూ శ్రీముఖి కార్తీక్ ను అనగానే అక్కడ పాల్గొన్న మిగితా సభ్యులు అందరూ పగలబడి నవ్వుకున్నారు. అయితే ఈ షో లో తర్వాత డాక్టర్ బాబు కార్తిక్ ఓ ఎమోషనల్ పర్ఫర్మ్యాన్స్ చేసాడు దాంతో అక్కడున్న వారంతా కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు.

అయితే ఈ ప్రదర్శన అయిపోయాక ఎమోషనల్ గా చాల మంది కామెంట్స్ చెప్పారు ,వాళ్ళల్లో ఎక్కువగా భావోద్వేగానికి గురి అయ్యింది మాత్రం ఉమా దేవి లేదా భాగ్యం గా పిలిచే కార్తీక్ సీరియల్ లో సలహా నటి. ఆ స్కిట్ లో ఇద్దరు పిల్లలు వారి తండ్రిని కోల్పోతారు తర్వాత వారు ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తారు, ఎలాంటి సమస్యలు వారు ఈ సమాజం తో ఎదురుకుంటారు అనే విషయాలకు ఎంతగానో ఎమోషనల్ అయిపోయి భాగ్యం కంట తడి పెట్టుకుంటూ నిజంగానే ఇలాంటి వారు ఈ సొసైటీ లో ఉన్నారు .అలంటి వారి జీవితం ఆలోచిస్తేనే ఎంతో బాధ కలుగుతుంది అంటూ ఆమే అన్నారు.

శ్రీముఖి మరియు సుమ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో కార్తికా దీపం, వదినమ్మ, దేవతా, జానకి కలగనలేదు అనే ప్రముఖ కార్యక్రమాల నుండి 50 మందికి పైగా టీవీ నటులు పాల్గున్నారు. టీవీ సెలబ్రిటీల నుండి వచ్చిన 18 అద్భుతమైన ప్రదర్శనలతో పాటు, జబర్దాస్త్ అవినాష్ మరియు కామెడీ స్టార్స్ ఫేమ్ హరి చేసిన ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఈ షో యొక్క ముఖ్య ఆకర్షణలుగాఉన్నాయి.

ప్రభాకర్, మహి శివన్, మరియు పలువురు నటులు ఈ షో కోసం ఇటీవల చిత్రీకరించిన షూట్ నుండి అనేక బిటిఎస్ చిత్రాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఛానెల్ ఇంతకుముందు పరివార్ లీగ్ అనే టీవీ సిరీస్‌ను సీనియర్ యాంకర్ జాన్సీ హోస్ట్ చేసింది. ఈ ధారావాహికలో ఆనాటి వివిధ ప్రసిద్ధ ప్రదర్శనల నుండి నటులు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *