sreemukhi-pradeep

శ్రీముఖి : ‘ప్రదీప్ ఐ లవ్ యు.. ఐదు ఏళ్లుగా దీనికోసమే ఎదురు చూస్తున్నా..’ అందరి ముందు ప్రదీప్ కు ప్రపోజ్ చేసిన శ్రీముఖి..! వైరల్ అవుతున్నా వీడియో..!

Trending

బుల్లితెరపై ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారు అంటే అతను ప్రదీప్ మాచిరాజు అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. అయితే అదే బుల్లితెరకు రాములమ్మ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యాంకర్ శ్రీముఖి మరియు ప్రదీప్ మధ్యలో ఏదో రిలేషన్షిప్ నడుస్తుందని మనలో దాదాపుగా అందరికి తెలుసు.దీని తోడు గా వారిపై వస్తున్న ఈ రూమర్స్ వారు ఎప్పుడు కూడా కందించకపోవడం తో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.

వారు లవ్ లో ఉన్నారు అని సోషల్ మీడియా లో కుప్పలు కుప్పలుగా రూమర్స్ చక్కట్లు కొడుతున్న వారిలో ఒక్కరు కూడా ఈ విషయం పై ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. కాబట్టి వారి మధ్యలో సంథింగ్ సంథింగ్ ఉంది అని చెప్పకనే చెప్తున్నారు శ్రీముఖి-ప్రదీప్ లు. దీనికి తోడుగా టీవీ షో నిర్వాహకులు ఈ రూమర్స్ ను వినియోగించుకొని వీరి మధ్య రొమాంటిక్ సీన్స్ పెడుతూ ఈ జంటకు సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ ని చక్కగా ఉపయోగించుకొని బాగా టిఆర్పీ లు పెంచేసుకుంటున్నారు.

అయితే ఇటీవల రిలీస్ అయిన డ్రామా జూనియర్స్ షో యొక్క ఒక ప్రోమో వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మనకు తెలుసు డ్రామా జూనియర్స్ షో ను ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడని. అందులో ఈ వారం రాబోయే ఎపిసోడ్ లో శ్రీముఖి ప్రత్యేకమైన ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆ షో లో శ్రీముఖీ స్పెషల్ గెస్ట్ గా వచ్చి ముసుకు వేసుకొని ప్రదీప్ ను డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది అది చూసిన జడ్జిలు అలీ,సింగర్ సునీత, ఎస్వీ కృష్ణ రెడ్డి లు షాక్ అయ్యారు.అలా ఆమె ప్రపోజ్ చేయగానే ప్రదీప్ తెగ సిగ్గు పడిపోయాడు.’డ్రామా జూనియర్స్ – ది నెక్స్ట్ సుపర్ స్టార్’ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో వీడియో లో ఈ రొమాంటిక్ సన్నివేశం కనిపించింది.

ఈ యాంకర్ లకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ తో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.ఇలా వారి మధ్య ఉన్న రిలేషన్షిప్ ను బహిరంగంగానే చూపిస్తున్నారు ఈ తోటి యాంకర్లు.

ఇదిలా ఉండగా తాజా నివేదికల ప్రకారం, ప్రదీప్ సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ అనే నాన్-ఫిక్షన్ షో యొక్క రాబోయే సీజన్ హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.యాంకర్ రవి డ్రామా జూనియర్స్ సీజన్ 5 హోస్ట్‌గా అడుగుపెట్టాడు.కాబట్టి డ్రామా జూనియర్స్ రియాలిటీ షో రాబోయే షూట్ షెడ్యూల్‌లో ప్రదీప్ పాల్గొంటారా అనేది ఇంకా అనిశ్చితంగా ఉంది.

సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ అతి త్వరలో సెట్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఎపిసోడ్లో సరదా పనులతో వివిధ రౌండ్లలో ప్రతిష్టాత్మక టైటిల్ కోసం పోటీ పడుతున్న ఈ ఛానెల్ యొక్క వివిధ ప్రసిద్ధ డైలీ సీయల్స్ నటులు ఈ ప్రదర్శనలో ఆడబోతున్నారు. సీజన్ 1 ను టీం ముద్ద మందరం గెలుచుకోగా, ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన సీజన్ 2 లో టీమ్ సూర్యవంశం కప్ ను గెలుచుకుంది.

ఛానల్ ఇటీవల టీజర్‌తో రాబోయే సీజన్‌ను ప్రకటించింది. రాబోయే సీజన్లో నటించాల్సిన నటులను మేకర్స్ ప్రస్తుతం ఖరారు చేస్తున్నారని దగ్గరి వర్గాలు వెల్లడిస్తున్నాయి. జట్ల గురించి మరిన్ని వివరాలు మరియు ప్రదర్శన యొక్క టెలికాస్ట్ తేదీ ప్రస్తుతానికి వేచి ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *