sreemukhi-saddam

శ్రీముఖి పరువు గోవిందా.! ఆమె శరీరాకృతిపై సద్దాం షాకింగ్ కామెంట్స్.!

News

యాంకర్ రాములమ్మ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెరపై చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బుల్లితెర పై ఆమె చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఆమె కంటూ సపరేట్ గా ఎలాంటి షో లేకపోయిన్నప్పటికి కూడా కొన్ని స్పెషల్ ఈవెంట్లకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా ఉంటూ వస్తున్నారు.ఆమె తెలుగు టెలివిజన్‌లో ఎక్కువగా కోరుకునే యాంకర్ లలో ఒకరు. అంతర్గత నివేదికల ప్రకారం శ్రీముఖి ఒక టీవీ షో కోసం ఎపిసోడ్కు రూ .70,000 వసూలు చేస్తారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో విజయవంతంగా పనిచేసిన తర్వాత ఆమె టెలీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇది కాకుండా ప్రత్యేక ప్రదర్శనలు మరియు కార్యక్రమాల కు ఆమె వసూలు చేసే ఫీజు వేరేగా ఉంటుంది. అయితే రీసెంట్ గా శ్రీముఖి ఒక స్పెషల్ ప్రోగ్రాంను నడిపించేందుకు ముందుకు వస్తున్నారు. పరివార్ చాంపియన్ అనే పేరుతో రాబోయే ఒక గ్రాండ్ షోలో బుల్లితెర రములమ్మని దారుణంగా ఆడుకున్నారు.

బుల్లితెరపై కమిడియన్ సద్దాం ఇప్పుడు ఎలాంటి ఫాంలో ఉన్నాడో అందరికీ తెలిసిన సంగతే.ఈటీవీలో ప్రసారం అయిన పటాస్ షో అప్పటి నుంచే శ్రీముఖి మరియు సద్దాంల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

ఇక ఆ మధ్యకాలంలోను అదిరింది, బొమ్మ అదిరింది ప్రోగ్రామ్స్ లో శ్రీముఖి మరియు సద్దాంలు కలిసి వర్క్ చేశారు. ఇక నెట్టింట్లో వీరు చేసే సందడి ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు,అందరికి బాగా తెలిసిన విషయమే.ఎన్ని షోస్ లో కలిసి పని చేసిన ఎన్ని వేసుకున్న కూడా ఆఫ్ స్క్రీన్ లో మాత్రం యాంకర్ శ్రీముఖిని సద్దాం అక్కా అనే పిలుస్తుంటారు. అయితే ఇటీవలే సద్దాం ఓ షో లో శ్రీముఖి శరీరాకృతి గురించి సెటైర్లు వేసాడు.

 sreemukhi-saddam

తాజాగా విడుదలైన ఆ షో యొక్క లేటెస్ట్ ప్రోమోలో వీడియో లో కమిడియన్ సద్దాం దారుణంగా శ్రీముఖి పై సెటైర్స్ వేసి ఆమె పరువు తీసాడు.

అయితే స్టార్ మా లో సీరియల్స్ లో పని చేసే సభ్యులందరూ కలిసి పాల్గొంటున్న పరివార్ చాంపియన్ అనే ప్రోగ్రాంకు శ్రీముఖి హోస్ట్‌గా పనిచేస్తుంది. అయితే ఈ సందర్భంలో అసలు తగ్గేదేలే అంటూ శ్రీముఖి హీరో బన్నీ తీస్తున్న పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పేసింది. అయితే అప్పుడు వెంటనే సద్దాం మధ్యలో కలిగించుకొని శ్రీముఖి శరీరాకృతి పై సెటైర్ వేశాడు. నువ్వు మాత్రం కొంచెం తగ్గాలి అంటూ శ్రీముఖి భారీ శరీరం పైన సెటైర్ వేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *