టీవీ సెలెబ్రిటీలైన శ్రీవాణి, గీతా సౌజన్య, ప్రశాంతి మరియు నవీన వీళ్లంతా ఒక గ్రూప్ ఇంటర్వ్యూ నిర్వహించి తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్న పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో వారు తమ ఫస్ట్ లవ్ అనుభవాలను పంచుకుంటూ ఫస్ట్ కిస్ పై ఓపెన్‌గా మాట్లాడేసింది టీవీ నటి శ్రీవాణి.
అయితే తనకి 16 సంవత్సరాల వయసులో తన భర్త విక్రమ్ హైదరాబాద్ సిటీ లోని లవర్స్ అడ్డాగా పేరొందిన దుర్గం చెరువు దగ్గరికి తీసుకుని వెళ్లి ఫస్ట్ కిస్ ఇచ్చాడని ఆమె చెప్పింది. తమ పెళ్లికి ముందే ముద్దులు అయిపోయాయి అంటూ అన్ని బయట పెట్టేసింది. అయితే అప్పట్లో తనకు అంత సీన్ లేదు అని, ఆయనే నాకు మొదట ముద్దు పెట్టాడు.
మా ఆయన చాలా అందంగా ఉంటాడు. ఆయన అలా అందంగా ఉంటేనే నేను హ్యాపీ ఎందుకంటే అప్పుడు ఎవరూ తన వెనక పడరు అంటూ చెప్పింది. మా ఆయన వేరే అమ్మాయికి కిస్ పెట్టాడా లేదో నాకు తెలియదు. ఒకవేళ అలా పెట్టడం నేను చూసి ఉంటే నా చేతుల్లో బతకడుగా అంటూ తన భర్త కు తీపి హెచ్చరిక ఇచ్చింది శ్రీవాణి.
అయితే ఈ నటి లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయట. 16 ఏళ్లకే తన ప్రియుడితో కిస్సులు కానిచ్చేసిన ఈ భామ, 17 ఏళ్లకే ప్రేమించిన వాడితో పారిపోయి పెళ్లి చేసుకుందాం అని ఇంటి నుండి వెళ్లిపోయిందట. అయితే పెళ్లికి 18 ఏళ్లు నిండకపోవడంతో ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసి, ఆ తరువాత అతన్ని పెళ్లిచేసుకుంది. అయితే ఆ తరువాత ఎవరికీ తెలియజేయకుండా అమలాపురం దగ్గర్లో ఉండే బెండమూర్లంకకు పారిపోయి,ఓ డాన్స్ కొరియోగ్రాఫర్ హెల్ప్ తో అక్కడే దాదాపు గా 45 రోజులు పాటు మకాం పెట్టారు.
View this post on Instagram
అయితే శ్రీవాణి లేచిపోయి పెళ్లి చేసుకునే సమాయంలో ఆమె ‘ఘర్షణ’ అనే సీరియల్ చేస్తుంది. అయితే ఆమె ఇలా వెళ్లిపోవడంతో ఆ సీరియల్ ఆగిపోయింది. ఈటీవీ ఛానల్ చరిత్ర లో 60 ఎపిసోడ్లతో నిలిచిపోయిన సీరియల్ అదే. అయితే దాంతరువాత తిరిగి ఈటీవీ ఛానల్ వాళ్లు ‘చంద్రముఖి’ అనే సీరియల్‌లో తనకి ఇంకో అవకాశం ఇచ్చారు. ఆమె దాదాపుగా ఏడేళ్ల పాటు ఈ చంద్రముఖి సీరియల్ లో నటించింది.