పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుడిగాలి సుదీర్..! అంతా బయట పెట్టేసిన ఆటో రామ్ ప్రసాద్..

News

జబర్దస్త్ లో చిన్న చిన్న క్యారెక్టర్ లతో అందరికీ దగ్గరైనా సుధీర్ తనకు ఉన్న టాలెంట్ తో హీరోగా కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. జబర్దస్త్ షో లే కాకుండా ఇంకా తనకు ఎన్నో ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. అలానే తన స్టైల్ కి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

Sudheer Team

అయితే సుధీర్ చేసిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య సుధీర్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే మొన్న జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్ లో తమ పర్సనల్స్ గురించి తన స్నేహితులైన గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కొన్ని నిజాలు చెప్పారు….!

Sudheer rashmi

మొదట్లో మ్యాజిక్ షో చేసుకుంటా ఈ తెలుగూ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించాడు. తనకు ఉన్న టాలెంటు తొ మ్యాజిక్ షో లే కాకుండా జబర్దస్త్ లో ఆడిషన్ కూడా ఇచ్చాడు. ఇలా జబర్దస్త్ లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థానం సంపాదించుకున్నాడు. తనకున్న టాలెంటుతో జడ్జెస్ నే కాకుండా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా ఆర్టిస్టు నుంచి టీం లీడర్ గా ప్రమోషన్ అందుకున్నాడు. అప్పటినుండి గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సన్నీ , వీరు నలుగురికి ఒక ప్రత్యేక ఇమేజ్ వచ్చింది.

రష్మీ వల్లే ఇదంతా జరిగింది..!

సుదీర్ మ్యాజిక్ ఏ కాకుండా డాన్స్ ,యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. ఇలా బుల్లితెర ఆల్ రౌండర్ గా టాలీవుడ్ లో స్థిరపడ్డాడు. అయితే జబర్దస్త్ షో లో యాంకర్ గా ఉన్న రష్మీ తో లావ్ ట్రాక్ ఉందని ఆడియన్స్ని నమ్మించారు. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలా రష్మి గౌతమ్ తో తనకు ఇంకా ప్రజలలో ఫెమ్ మరియు క్రేజీ వచ్చింది. యూట్యూబ్ లో జబర్దస్త్ స్కిట్స్ ని అప్లోడ్ చేస్తారు. అందులో ఎక్కువగా సుధీర్ రష్మీ ల గురించి కామెంట్స్ రావడం పెద్ద విశేషం అని చెప్పక్కర్లేదు.

అయితే జబర్దస్త్ లోనే కాకుండా యాంకర్గానూ సుధీర్ మంచి పేరు సంపాదించాడు. డీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోలలో యాంకర్ గా చేస్తున్నాడు. అయితే చిరంజీవి బర్త్ డే స్పెషల్ మరియు రాఖీ పండుగ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో టీం లీడర్స్ తమ అక్కాచెల్లెళ్లను స్టేజి మీదకి పిలిచారు. అందులో సుధీర్ అక్క కూడా వచ్చింది. తనకి మరియు సుధీర్ కి ఒకే సంవత్సరం గ్యాప్ ఉందని చెప్పుకొచ్చింది అయినా కానీ మేము ఫ్రెండ్స్ లానే ఉంటామని చెప్పింది. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అని చెప్పింది.

అప్పుడు గెటప్ శీను’ అన్ని చూసుకోలేదు కొన్ని నిజాలు నాకు మాత్రమే తెలుసు నేను నీకు చెప్తా.’అని సుధీర్ కి షాక్ ఇచ్చాడు.అప్పుడు ఆటో రాంప్రసాద్ అక్క వీడి పెళ్లి కోసం నువ్వు మూడు సార్లు కెనడా నుంచి వచ్చావని దానికి ఫ్లైట్ టికెట్లు వేస్ట్ అని చెప్పాడు. ఇలా మళ్లీ సుధీర్ పెళ్లి వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *