sudigali-sudheer-with-sri-reddy

సుడిగాలి సుదీర్ శ్రీ రెడ్డి కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోలో బిగ్ బాస్ ప్రియా. వైరల్ అవుతున్న న్యూస్.

News

శ్రీరెడ్డి టాలీవుడ్ లో ప్రతి విషయం పై సెగలు కక్కుతున్న మహిళగా ముద్ర వేసుకుంది. గతంలో టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనే దరిద్రం ఉందని దాని కోసం పోరాటానికి పును కొని ఎన్నో రోజులుగా వైరల్ అయింది, ఆ సమయంలో తన వాదనను తప్పన్న ప్రతి వ్యక్తిని నోటికి వచ్చినట్టు తిడుతూ ఎంతోమంది టాప్ హీరో హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను బయట పెట్టి పరువు తీసే ప్రయత్నం చేసింది. అప్పటి నుండి శ్రీ రెడ్డి సినిమా తెరపై కాకుండా ఏదో ఒక అంశంపై స్పందిస్తూ తనదైన శైలిలో దాని గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

నాగ చైతన్య సమంతా ల విడాకులపై స్పందించిన ఆమె తాజాగా రాజకీయాలపై కూడా విరుచుకుపడింది, గత కొన్ని రోజులుగా జగన్ ప్రభుత్వం మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య నడుస్తున్న ఘర్షణ గురించి ప్రస్తావిస్తూ బోల్డ్ మాటలతో రాజకీయ నాయకుల పై విరుచుకుపడింది.

ఏపీ సీఎం జగన్ ను సపోర్ట్ చేస్తూ ప్రత్యర్థి అయిన టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి నోటికొచ్చినట్టు బూతులు తిట్టింది, పవన్కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఒరేయ్ దద్దమ్మ, నువ్వు మొదలు పెట్టావు రా సన్నాసి, నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు, ఇలాంటి బూతు రాజకీయాలు మొదలు పెట్టింది నువ్వు అంటూ విరుచుకు పడింది.

sudigali-sudheer-with-sri-reddy

ఈ పరిస్థితులన్నీ ఇలా ఉండగా తాజాగా శ్రీ రెడ్డి సుధీర్ లు కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో ఏడవ వారం ఎలిమినేట్ అయిన ప్రియా కూడా ఉండటం మరింత ఆసక్తి రేకెత్తించింది.

ప్రియా బిగ్ బాస్ హౌస్ లో ఉండగా మంచి పేరు సంపాదించు కుంది. అయితే ఆమె కొంతమంది ఇంటి సభ్యుల మీద మోపిన నిందలు మరియు అనుమానాల వల్ల ఫేమస్ అయిన ఆమె ఒకేసారిగా పాతాళానికి పడిపోయింది. ఇక ఏడో వారం ఎలిమినేట్ అయిన ఆమె శ్రీ రెడ్డి తో కలిసి ఫోటో లో ఉండడం తో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది. అయితే సుధీర్ గెటప్ ను బట్టి ఈ ఫోటో చాలా పాతది గా కొంతమంది గమనించారు. ఈ ఫోటోలో సుధీర్ ఫిజిక్ నాలుగేళ్ల కిందట ఎలా ఉందో అలా ఉండడం వల్ల ఈ ఫోటో అప్పటిదే అని భావిస్తున్నారు.

ప్రస్తుతము ఎలిమినేట్ అయిన ప్రియ భవిష్యత్ కార్యాచరణనలు ఏమై ఉన్నాయో ఇంకా స్పష్టత ఇవ్వలేదు , శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది, అలాగే సుదీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత ఎవరో బయటికి లాగడంతో వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *