sudigali-team-extra-jabardasth

ఎక్సుట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ టీం గుడ్ బై, జబర్దస్త్ కి భారీ షాక్, ఇకపై వీరిని ఇలా చూడలేమా?

Movie News

తెలుగునాట ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే  కామెడీ ప్రోగ్రామ్ జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్ ఈటీవీలో వారానికి రెండు సార్లు వస్తుంటుంది. ప్రతీ శుక్రవారం ఎక్సు ట్రా జబర్దస్త్ వస్తుంది. ఈ కార్యక్రమానికి రశ్మి యాంకర్ గా వ్యవహరిస్తే, ప్రతీ గురువారం వచ్చే జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ యాంకర్. అయితే ఇన్నాళ్లూ మొత్తం జబర్దస్త్ కార్యక్రమానికే హైలైట్ గా నిలిచిన సుడిగాలి సుధీర్ టీం మాత్రం జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసినట్టుగా తెలుస్తోంది.

సుడిగాలి సుధీర్ టీం లో సుడిగాలి సుధీర్ తో పాటుగా,గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ముఖ్యమైన సభ్యులు. గెటప్ శ్రీను గెటప్పులతో, ఆటో పంచులతో రామ్ ప్రసాద్ ఇన్నాళ్లూ తెలుగు టీవీ ప్రేక్షకులను అలరించారు. వీరి టీం చేసే కామెడీ స్కిట్స్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసేవారు. అయితే ఇటీవల కాలములో సుడిగాలి సుధీర్ వరుసగా సినిమాలలో హీరోగా చేస్తూ బిజీగా ఉంటున్నాడు.  అలాగే గెటప్ శ్రీను కూడా చాలా సినిమాలలో కామెడీ రోల్స్ చేస్తూ బిజీగా ఉండగా, ఆటో రామ్ ప్రసాద్ కూడా చాలా సినిమాలలో రైటర్ గా అవకాశం దక్కించుకోవడం విశేషం. అందువల్ల ఈ ముగ్గురూ తాము చేసే స్కిట్స్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నామని భావిస్తున్నారట.

అయితే ఇలా ఈ టీం సినిమాలలో బిజీ అయిపోవడం వల్ల, జబర్దస్త్ కార్యక్రమములో చేయడానికి వీలు కుదరకే ఈ టీం జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పనుందని ఒక టాక్ బయట బలంగా వినిపిస్తుండగా, ఇంకోవైపు నుండి మల్లెమాల వారే ఈ టీంను ప్రక్కన పెట్టేసి, కొత్త  టాలెంట్ ను ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే ఎక్కువ పారితోషికం తీసుకునే సుధీర్ టీంను ప్రక్కనే పెట్టేసినట్టుగా వినిపిస్తోన్న మరో టాక్.

అయితే జబర్దస్త్ ప్రారంభం అయిన మొదటి రోజుల్లో టిల్లు వేణు,ధనరాజ్, చలాకీ చంటి టీములలో కేవలం మెంబర్స్ అయిన సుడిగాలి సుధీర్,గెటప్ శ్రీను,ఆటో రామప్రసాద్ లు తమ కామెడీ టైమింగ్ తో అతి తక్కువ కాలములో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా చాలా తక్కువ సమయములో ఈ ముగ్గురూ ఒక టీం గా ఏర్పడి ఎంతో మంచి కామెడీని తెలుగు ప్రేక్షకులకి ఇన్నిరోజులుగా అందించడం జరిగింది. అంతేకాకుండా సుడిగాలి సుధీర్ టీం ఎక్కువ పాపులర్ కావడానికి రష్మి కూడా ఒక కారణం అని చెప్పాలి. ఆ ప్రోగ్రామ్ యాంకర్ రష్మితో సుడిగాలి సుధీర్ చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ వర్కవుట్ కావడంతో వీరి మధ్య ఏర్పడిన కెమిస్ట్రీని చూసి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించారు.

ఇటీవలే ఈటీవీ వారు రిలీజ్ చేసిన ఈ ప్రోగ్రాం ప్రోమోలో సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్,గెటప్ శ్రీను ఒకింత బరువెక్కిన హృదయంతో తాము జబర్దస్త్ ను వీడి వెళ్తున్న విషయం స్వయంగా జబర్దస్త్ డయాస్ పైనే ప్రకటించారు. అయితే తాము గుడ్ బై చెబుతున్న విషయం మీడియా వారికి ఇంటర్వూ ఇచ్చినప్పుడు చెప్పాలనుకున్నామని, కానీ ఇలాంటి పరిస్తితిలో చెప్పాల్సి వస్తుందని భావించలేదని రామ్ ప్రసాద్ ఒకింత బాధతో ఈ విషయాన్ని ప్రకటించాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఇలా ఈ టీం జబర్దస్త్ కి గుడ్ బై చెప్పడం పట్ల, ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఒకింత షాక్ కి గురవుతున్నారట. అయితే ప్రేక్షకులతో పాటుగా జబర్దస్త్ కార్యక్రమానికి ఒకరకంగా ఇది గట్టి షాక్ అనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *