ఆ స్థానం లో తను ఉంటె ఎలా ఉండేదో అంటూ ఆ ఫోటో పై సుమ సంచలన వ్యాఖ్యలు..! వైరల్ అవుతున్న వీడియో

Movie News

తెలుగు బుల్లి తెరను సుమారు రెండు దశాబ్దాలుగా మకుటం లేని మహారాణి లాగా పరిపాలిస్తున్నారు యాంకర్ సుమ. అద్భుతంగా చెప్పే డైలాగ్ టైమింగ్ తో పాటుగా అవసరమైనప్పుడు తనదైన శైలిలో కామెడీని పండించడంలో ఆమె కి ఎవరు పోటీ రాలేరు. ఎప్పుడు కూడా అందాల తారలతో నిండుగా కనిపించే చిత్ర పరిశ్రమలో సంప్రదాయంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.అందుకే ఆమె కి వరుసపెట్టి ఆఫర్లు వచ్చేవి.

తర్వాత ఆమె టాలెంట్ కు ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది మంచి అందమైన యాంకర్లు వచ్చిన వాళ్ళను పక్కకు నెట్టి సుమ ఇంకా నెంబర్ వన్ గానే నిలిచింది.ఆమె ఇన్ని సంవత్సరాల కాలం లో ఎన్నో షో లకు హోస్ట్ గా చేసింది. కొన్ని వందల మూవీ ఈవెంట్లకు కూడా పని చేసింది.వ్యాపార ప్రకటనలు యూట్యూబ్ వీడియోస్ తో ఆమె చాలా బిజీ గా మారిపోయారు.

అది ఏ షో ఐన సరే దానికి సరైన అందం సుమ గారి యాంకరింగ్ తోనే అని అన్నంతగా ఆ స్థాయి గుర్తింపును ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె ఎన్నో షోలకు యన్కెరింగ్ చేసింది మంచి పేరు కూడా తెచ్చుకుంది అయితే ఆమె కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టిన షోలలో ఒకటి తప్పకుండ క్యాష్ అని చెప్పటం లో ఎటువంటి సందేహం లేదు.

అయితే వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ప్రోగ్రాం యొక్క లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు ఆ షో నిర్వాహకులు. ఇందులో శిరీష – సన్నీ, వాసుదేవ్ – కరుణ, పవన్ – అంజలి, విశ్వ – ప్రశాంతి ల జంటలు పాల్గొన్నారు. వీళ్లతో సుమ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వాళ్ళు సుమ అడిగిన ప్రశ్నలకు పంచులతో కూడిన సమాధానాలు ఇచ్చారు. దాని కారణంగా ఈ ప్రోమో వీడియో విపరీతంగా వైరల్ గా మారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఈ షోలో సన్నీ మాట్లాడుతూ.. ‘స్వామి రారా సినిమా చూసిన తర్వాత వెస్ప తీసుకున్నాను’ అన్నాడు. సుమ వెంటనే మరి టైటానిక్ చూసాక ఎం కొన్నావ్ అంటుంది. అప్పుడు వెంటనే వాసుదేవ్ అందుకుని ‘టైటినిక్ లో పడవపై ఆ ఫోజ్ ఉంటుంది కదా అది ట్యాంక్‌బండ్ మీద ట్రై చేశారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు’ అని చెప్పాడు. అప్పుడు ఆ సినిమా లో ఉండే ఆ ఫొటో ప్రస్తావన వచ్చింది.

వాసుదేవ్ చెప్పిన మాటలకు సన్నీ ‘మీరు మాట్లాడేది ఏ ఫోజు? బొమ్మ గీశాడు కదా అదేనా ‘ అని అడుగుతాడు. అప్పుడు అందరూ పగలబడి నవ్వేస్తారు. అయితే సుమ అప్పుడు ఆ సినిమాలో అసలు జాక్ రోజ్ బొమ్మను వేసే బదులు రోజ్ జాక్ బొమ్మ వేస్తే ఎలా ఉండేదో అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తరువాత ఆమె కింద పడి మరీ నవ్వింది. దాని కారణంగా ఈ ప్రోమో వీడియో హైలైట్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *