సుమ అలా చేసేసరికి గుండె పగిలి బోరున ఏడ్చేసా.! రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్ ..!

News

టాలీవుడ్ లి ది బెస్ట్ యాంకర్ ఎవరు అని ఎవరినైనా అడిగి చూడండి, ఒక్క క్షణం ఆలోచించకుండా ప్రతీ ఒక్కరు చెప్పే పేరు యాంకర్ సుమ.అంతేకాకుండా రాజీవ్ కనకాల మరియు సుమ గారి జంటను తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఆదర్శ జంటలలో ఒకటిగా చూస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని వీరు త్వరలోనే విడిపోతారు అంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సినిమా ఫంక్షన్లలో సుమ గారు చేసే కామెడీ వేరే లెవెల్ లో ఉంటది.ఆమె సినిమా ఫంక్షన్స్ చేయకపోతే అసలు ఆ ఫంక్షనస్ లో ఏదో లోటు ఉన్నట్లు గానే అనిపిస్తుంటుంది.అందుకే టాలీవుడ్ లో చాలా మంది బడా హీరోలల్లో కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు.ఆమె ఫంక్షన్ ని హోస్ట్ చేసిందంటే ఆ సినిమా సక్సెస్ అయినంత సంతోషం కలుగుతుంది అంటుంటారు టీ టౌన్ సెలబ్రిటీలు.

kanakala suma

ఇక సోషల్ మీడియా విషయానికి వచ్చినా అక్కడ కూడా సుమకి ఉన్న క్రేజే వేరు. యాంకర్ సుమ గారిని చూసి ఓర్వలేకో లేదా వారికి వ్యూస్ ను పెంచుకోడాని కోసమో తెలీదు కానీ ఎక్కువగా ఈ దంపతుల పై నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఈ చిల్లర వార్తలు రాసే వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు రాజీవ్ కనకాల. అంతే కాకుండా అతను చనిపోయే వరకు తాను సుమను విడిచిపెట్టలేనని స్పష్టం చేసారు. అంతే కాదు ఆ ఇంటర్వ్యూలో అతను వారి లవ్ స్టొరీ ని కూడా పంచుకున్నాడు.

‘ మీలో చాలామంది అనుకుంటున్నట్లుగా మాది ఆరెంజ్ మ్యారేజ్ కాదు పక్కా లవ్ మ్యారేజ్.ఆమెని పడేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. దూరదర్శన్‌లో 1994లో ఓ పైలెట్ ఎపిసోడ్ ఎడిటింగ్ టైంలో నేను మొదటి సారి సుమని చూసాను. సరిగ్గా ఆ టైంలోనే ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అనే సాంగ్ లోపల మార్మోగింది. 1991 లోనే సుమ టీవీ ఎంట్రీ ఇచ్చిందన్న సంగతి నాకు అప్పటివరకు తెలీదు.

అయితే ఆమెని మొదటి సారి చూడగానే తనకి పడిపోయాను. ఇంత అందంగా ఉంది ఏంటి ఈ అమ్మాయి అని అనుకున్నాను.ఇంత కాలం ఈమె నాకు కనిపించలేదు ఏంటి అసలు ఎక్కడి నుండి వచ్చింది ఈమె అనుకున్నాను.అయితే ఆ సమయంలో జీకే మోహన్ గారు తెరకెక్కించిన ఒక సీరియల్ లో మాధురి అనే ఎపిసోడ్లో నా పక్కన ఆమె నటించింది. ఆ షూటింగ్ కేవలం ఒక్కరోజే.చా షూటింగ్ ఒక్కరోజేనా.? ఇంకొక రోజు ఉంటే ఆమెని పాడేసే వాని కదా అను నాలో నేను అనుకున్న.

నేను అనుకున్నట్లే షూటింగ్ ఇంకా ఒక రోజుకి పొడిగించారు.అయిన కూడా అక్కడ మ్యాజిక్ ఏం జరగలేదు. తర్వాత మళ్ళీ షూటింగ్ జరిగి సుమ నేను మళ్ళీ కలిస్తే బాగుండు అని ఎదురుచూస్తున్న టైంలో మీర్ డైరెక్షన్లో వచ్చిన జీవనరాగం అనే సీరియల్‌లో ఇంకో ఛాన్స్ వచ్చింది.

ఇక మొహమాట పడకుండా సుమకి ప్రపోజ్ చేసాను. ఆమె నా ముఖం పైనే డైరెక్టుగా నో చెప్పేసారికి నా గుండె పగిలిపోయి కళ్ళలో నుండి నీళ్లు ధారలు కట్టాయి. ఇది జరిగిన తర్వాత చాలా రోజులవరకు సుమ సెట్స్ లో కనిపించలేదు దాంతో నాకు దుఃఖం మరింత ఎక్కువైంది. అయితే కొన్ని రోజులు గడిచాక మళ్ళీ సుమ షూటింగ్ కి వచ్చింది. అప్పుడు ఎక్కడలేనంత సంతోషం వేసింది.

షూటింగ్ అయిపోగానే సుమని ఆటోలో డ్రాప్ చేయమని ప్రొడక్షన్ వాళ్ళు అనుకుంటున్న టైంలో సుమ గారు అవసరం లేదు నేను రాజీవ్ కార్లో వెళ్తాను అని చెప్పింది. అలా మొదలయ్యింది మా ప్రేమ ప్రయాణం’ అంటూ రాజీవ్ కనకాల వారి లవ్ స్టోరీ ని పూస గుచ్చినట్లు వివరంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *