టాలీవుడ్ లో హీరో సుమంత్ అంటే ఈ జనరేషన్ లో ఎక్కువ మంది గుర్తు పట్టకపోయినా, అక్కినేని నాగేశ్వర్రావు మనవడు, కింగ్ నాగార్జున మేనల్లుడు సుమంత్ అంటే దాదాపుగా అందరూ గుర్తు పడతారు. అయితే ఈ నటుడు ప్రేమకథ అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేసాడు, అయితే ఆ సినిమా అంతగా రాణించలేకపోయింది. కానీ తర్వాత సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమా ఘనవిజయం సాధించి నటుడిగా సుమంత్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయినా కూడా తర్వాత ఎన్నో సినిమాలు చేసిన సుమంత్ కు అంతగా కలిసి రాలేదు, ఏ మూవీ చేసిన పెద్దగా ఆడకపోవడంతో సుమంత్ నటనకు చాలా కాలంపాటు దూరం ఉన్నారు.

అయితే తాజాగా ఈ నటుడు రెండవసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, అతను చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర అని కూడా తెలుస్తోంది, అయితే సుమంత్ ఈ పెళ్లిని ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా చేసుకోవాలని, కొంత మంది ముఖ్యమైన వారు , సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేస్కోలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారి పెద్ద చర్చనీయాంశంగా మారింది కూడా. దీని పై రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.
వర్మ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇలా రాసాడు..”ఒకసారి పెళ్లి చేసుకున్నాక కూడా నీకు బుద్ధి రాలేదా సుమంత్.? నీ కర్మా, నువ్వు చేసుకోబోయే ఆ పవిత్ర కర్మా ,ఇక అనుభవించండి” అంటూ చాల ఘాటుగా పోస్ట్ చేసాడు. అయితే వర్మ ఇలా కామెంట్ చేయగానే ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది.

అయితే తన రెండవ పెళ్లి పై నటుడు సుమంత్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ కనీసం వర్మ చేసిన ఈ ఘాటైన ట్వీట్ కి అయినా స్పందిస్తాడో లేదో చూడాలి.
అయితే సుమంత్ వ్యక్తిగత జీవితానికి వస్తే అతను దాదాపు 15 సంవత్సరాల క్రితం తీసిన ప్రేమకథ అనే చిత్రంలో తన సరసన నటించిన కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
Oka pelle noorella penta ayithe, rendo pellentayya Swami ? Naa maata vini maneyyi ..Pavitra gaaru, mee jeevithaalani paadu chesukokandi..Thappu meedhi @iSumanth dhi kaadhu ..Thappu aa dhaurbhagyapu vyavasthadi pic.twitter.com/DUJKRQuiC6
— Ram Gopal Varma (@RGVzoomin) July 28, 2021
అయితే వారు ఆలా చేసుకొన్న కొన్నాళ్లకే వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి వారు విడిపోయారు. అయితే సుమంత్ తో విడిపోయాక కీర్తి రెడ్డి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యింది. కానీ సుమంత్ మాత్రం 15 సంవత్సరాలుగా ఇంకో పెళ్లి చేసుకోకుండా ఆలా ఉండిపోయారు. అయితే రెండో పెళ్లి చేసుకొమ్మని అతని ఇంటి వారు ఎంత బలవంతం చేసిన కూడా మంచి అమ్మాయి దొరికితే తప్పకుండ చేసుకుంటాను అని సమాధానం ఇచ్చేవాడు కానీ అలంటి అమ్మాయి దొరుకుతుందనే నమ్మకం తనకు లేదని చెప్తూ ఉండేవాడు.
ఇవి కూడా చదవండి