తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేర్లలో కమెడియన్ సునీల్ పేరు కూడా ఒక్కటి.అతని కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఒక్కానొక సమయంలో టాలీవుడ్ లో అతనే స్టార్ కామెడియన్ గా ఉండేవాడు. ఎంతో మంది తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్లు ఉన్నా కూడా సునీల్ కామెడీ కి ఉన్న ఆ క్రేజ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది.ఈ విషయం ప్రతి చిత్ర ప్రేమికుడికి తెలుసు.అయితే విల్లన్ పాత్రల కోసం చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సునీల్ టాలీవుడ్ చరిత్రలోనే గొప్ప కమెడియన్ గా ఎదిగాడు.
నువ్వే కావాలి అనే చిత్రంలో కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన సునీల్, నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో టాలీవుడ్లోనే ది మోస్ట్ వాంటెడ్ కామెడాన్ గా మారాడు. దాంతర్వాత వరుసగా ఎన్నో మూవీస్ లో కమెడియన్ గా అవకాశాలు వచ్చాయి. ఆ టైం లో అతను సంవత్సరానికి ఏకంగా 20 సినిమాలలో నటించేవాడు అంటే అది చిన్న విషయం అసలు కాదు.అతని నటనకు నంది అవార్డు తో పాటు పలు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సునీల్ గెలుచుకున్నాడు.అయితే సినిమాలలో నటించే తెరపైన కనబడే సునీల్ అందరికి తెలుసు.
కానీ అతని పర్సనల్ లైఫ్ గురించి దాదాపు మనలో ఎవరికి తెలవదు అనే చెప్పాలి. అతని కుటుంబం అతని భార్య ఎక్కువగా మనకు ఎక్కడ కనిపించరు.భీమవరంలో పుట్టి పెరిగిన సునీల్ సినిమాల్లోకి రావడానికన్నా ముందు వరకు అక్కడే ఉండేవాడు. అయితే దర్శకుడు, మాటల మాంత్రికుడు మరియు సునీల్ కి మంచి స్నేహితుడు అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రోత్సాహం తో అతను చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఇండస్ట్రీకి రావడం రావడమే మంచి గుర్తింపు సొంతం చేసుకొని ఫుల్ పాపులర్ అయిపోయాడు సునీల్.
అయితే సునీల్ ఇండస్ట్రీ కి వచ్చిన కొంత కాలానికే పెళ్లి చేసుకున్నాడు.అయితే ఇంతవరకు కూడా అతని కుటుంబం గురించి ఎవరికీ ఐడియా లేదు అనే చెప్పాలి.అతనికి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని తండ్రిని కోల్పోయాడు. అప్పటినుండి అతను అమ్మ లాలన లోనే పెరిగాడు. సునీల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంత కాలం పని కూడా చేసాడు కానీ ఈ విషయం అసలు ఎవరికీ తెలవదు, సునీల్ కూడా ఎప్పుడు ఈ విషయాన్ని ఎక్కువగా ఎక్కడ మాటలాడలేదు.
ఇదిలా ఉంటె అతని భార్య పేరు శృతి .ఆమె ఫోటోలు కూడా ఎక్కువగా మనకు కనిపించవు. అతని కుటుంబాన్ని సునీల్ చాలా సీక్రెట్ గా ఉంచుతాడు. తెలిసిన కుటుంభం నుండే అతను తన భార్యను తెచ్చుకున్నాడు.రాయితీ సునీల్ ది ప్రేమ వివాహం కాదు పెద్దలు కుదిర్చినా వివాహమే, 47 ఏళ్ల సునీల్ కి ఇద్దరు పిల్లలు. ఒక పాప ఒక బాబు. సునీల్ కుటుంభం కూడా బయట ఎక్కువగా కనిపించదు.అయితే సునీల్ అటు ఓ వైపు కమెడియన్ పాత్రలు పోషిస్తునే హరీష్ శంకర్ రాసిన వేదంతా రాఘవయ్య లో హీరోగా మన ముందుకు రాబోతున్నాడు.