ఆడవాళ్లను అలా అనుకున్నావు కాబట్టే నీకు ఇంకా పెళ్లి కాలేదు.!’ ప్రదీప్ పై సంచలన కామెంట్స్ చేసిన సింగర్ సునీత..

News Trending

ప్రదీప్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జన్మించాడు మరియు హైదరాబాద్‌లో పెరిగాడు. అతను విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు.అతను రేడియో మిర్చిలో రేడియో జాకీగా తన వృత్తిని ప్రారంభించాడు.అతను గడసరి అత్త సొగసరి కోడలు మరియు కొంచెం టచ్ లో ఉంటె చెప్తా వంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా పేరు పొందాడు.మాచిరాజు 2014 లో ఉత్తమ యాంకర్‌గా నంది అవార్డు గెలుచుకున్నారు. అతను 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సి సినిమా తో సినిమాల్లో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశాడు.

 

ప్రస్తుతం ప్రదీప్ ‘ఢీ 13′, ‘డ్రామా జూనియర్స్’, ‘సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్’ వంటి షోస్ తో పాటుగా పలు ఈవెంట్లకు కూడా హోస్టుగా పని చేస్తున్నాడు.ఓ వైపు హోస్టింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు మాచిరాజు. అంతే కాకుండా అతను పలు సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం అతను ‘డ్రామా జూనియర్స్ – ద నెక్ట్స్ సూపర్ స్టార్’ అనే చిన్న పిల్లల ప్రోగ్రామ్ను చేస్తున్న విషయం తెలిసిందే.

దీనికి అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి, రేణు దేశాయ్‌లు న్యాయమూర్తులుగా ఉంటున్నారు .అయితే, వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు మోహన్ బాబు కుమార్తె, టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా పలు రకాల స్కిట్‌ను చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను ఆ షో నిర్వహకులు తాజాగా విడుదల చేశారు. ఇది ప్రారంభం నుండి అంతం వరకు చాలా సందడిగా సాగింది.

ఫలితంగా ఈ లేటెస్ట్ ప్రోమో వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.అయితే అందులో ఓ స్కిట్‌లో భాగంగా ప్రజ్వల్ అనే చిన్న బాబు చందమామలా యాక్ట్ చేస్తూ ఓ స్కిట్‌ను చేసాడు. ఆ స్కిట్లో భాగంగా ఆ బుడతడు ‘అమ్మాయిలు డేంజర్‌ రోయ్, చాలా చాలా డేంజర్’ అంటూ పౌర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్‌ను పలికాడు.అయితే స్కిట్ అయిపోయాక ప్రదీప్ ఆ డైలాగ్ ను మల్లి గుర్తుచేశాడు.ఆ అబ్బాయి తో ఆ డైలాగ్ మరోసారి చెప్పని చెప్పాడు.

అప్పుడు సింగర్ సునీత ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో చూసావుగా నీకు బయటకి వెళ్లాలని లేదా అని అంటుంది. వెంటనే ప్రదీప్ ఆ చిన్న బాబు తో నేను చెప్పింది అమ్మాయి ల గురించి మాతరమే అని చెప్పారా అంటూ ఫన్నీ గా సమాధానం ఇచ్చాడు.

ఇండైరెక్ట్ గా ఆ షో లో కూర్చున్న వాళ్ళందరూ అమ్మాయిలు కాదు అంటీలు అని ప్రదీప్ చేసిన కామెంట్స్కి సింగర్ సునీతే స్పందించారు.ఆమె మాట్లాడుతూ.. ‘నువ్వు చేసిన స్టేట్మెంట్ ఆడవాళ్లపై చాలా డ్యామెంజింగ్ స్టేట్‌మెంట్. అందుకోసమే నీకు ఇంత వయసు వచ్చినా కూడా పెళ్లి అవ్వట్లేదు ‘ అంటూ ప్రదీప్ పై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. అప్పుడు అతను ‘అవును ఇది పెద్ద డైలాగే’ అంటూ సమాధానం ఇచ్చాడు. దాంతో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పగలబడి నవ్వారు.ఏదేమైనా ఈ ప్రోమో న్విదేమో మొత్తం సందడి సందడిగా సాగింది. ఫలితంగా ఈ ప్రోమో వీడియో యూట్యూబ్ లో వైరల్గా మారి తెగ హంగామా సృష్టిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *