సూపర్ స్టార్ కృష్ణ : 1980ల లోనే ‘బాహుబలి’ సినిమా..! అందులో హీరో ఎవరో తెలుసా.?!

Trending

మనలో దాదాపుగా ఎవరికి సూపర్ స్టార్ కృష్ణ తీసిన ‘సింహాసనం’ సినిమా గురించి ఎవరికి తెలిసుండదు. మనలో చాలా మంది ఈ సినిమా పేరు ను ఇప్పుడే కొత్తగా వింటున్నవారు కూడా. ఎందుకంటే 35 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పటి జనరేషన్ వారికి తెలిసి ఉండడం కష్టమే. కానీ ఒక్కసారి మీరు ఈ చిత్రం గురించి విన్న తరువాత ఈ సినిమా గొప్పతనం మీకు అర్ధం అయిన తరువాత ఈ మూవీ ను చూడకుండా ఉండడం కూడా అంతే కష్టం.

ఈ విషయాలన్నీ చదివాక మీకు తప్పకుండా ఈ సినిమా చూడలనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్ గా యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ సినిమా టైటిల్ సెర్చ్ చేయండి , ఈ సినిమా ఇప్పటికే పది లక్షల వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సినిమా విషయాలు ఎంటో ముందుగా తెలుసుకోండి.

ముందుగా తెలుసుకోవాల్సిన విషయం మరియు అందరు ఆశ్చర్య పోయే విషయం ఏంటంటే ఈ సినిమా కు డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు ఎడిటర్ అన్ని కూడా సూపర్ స్టార్ కృష్ణే. అంతే కాదు తెలుగు సినిమాలల్లో 70 ఎం ఎం స్టీరియోఫోనికి సౌండ్ ఉన్న సినిమా కూడా ఇదే.ఈ సినిమా సాధించిన గొప్ప ఘనత గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో ఈ సినిమా 80ల కాలం నాటి ‘బాహుబలి’ అని కచ్చితంగా చెప్పొచ్చు.ఈ సినిమా వసూళ్ల విషయం చూసిన రికార్డుల పరంగా చూసిన కూడా ఇది కచ్చితంగా ఆ కాలం బాహుబలి చిత్రం అని అంగీకరించక తప్పదు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎంటో కొన్ని విషయాలు చూద్దాం.

ఈ సినిమా విడుదలైన మొదటి కొన్ని రోజుల్లో టిక్కెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్ అక్షరాల 12 కిలోమీటర్ల దూరం ఉండిందంట. అంతేకాదు ఈ సినిమా ను ఆనాడే 3.5 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తే 5 కోట్లు వసూలు చేసిందంటా, ఈ సినిమా 100 రోజులు థియేటర్లలో విజయవంతంగా ఆడింది , అప్పుడు చెన్నై లో ఈ సినిమా సక్సెస్ మీట్ ఆరెంజ్ చేస్తే కృష్ణ అభిమానులు 400 బుసులల్లో ఈ సభకు వచ్చరంట.

ఇవి ఆ చిత్రం సృష్టించిన రికార్డుల్లో కొన్ని మాత్రమే , ఇంకా థియేటర్లల్లో జనం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికి కూడా ఈ సినిమా గురించి అప్పటి వారు కథలు కథలు గా చెప్పుకుంటు ఉంటారు.

వాస్తవానికి, ‘సింహాసనం’ కి ముందు, తెలుగులో చిరంజీవి ‘బొబ్బిలిపులి’, ‘సింహాసనం’ విడుదలైన తర్వాత 70 ఎంఎంలో చిరంజీవి ‘కొండవీటి దొంగా’ సినిమాలు తీసే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ సినిమాలు ఏవి కూడా సింహాసనం చిత్రం లాగా ప్రజలు ఎక్కువగా ఆదరించలేదు . ‘సింహాసనం’ ఆ ఘనతకు అర్హమైనది. తెలుగులో రెండవ 70 ఎంఎం చిత్రం నాగార్జున నటించిన ‘అగ్నిపుత్రుడు’ (1987). కాలక్రమేణా, డిటిఎస్, డాల్బీ మరియు డిజిటల్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రావడంతో, 6-ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ యొక్క ప్రధాన ఆకర్షణ అయిన 70 ఎంఎం సినిమాలను చూడడం ప్రజలు మానేసారు. అయితే తెలుగు తెరపై సాంకేతిక ప్రయోగాల పరంగా ‘సింహాసనం’ ఇప్పటికీ ఒక సంచలనం! చిరస్మరణీయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *