తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణి ఒకరు. ఆమె చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా పనిచేస్తోంది.
సురేఖా ప్రస్తుతం పలు చిత్రాల లో బిజీగా ఉంది. ఇదిలావుండగా, తన కుమార్తె సుప్రీత ఒక ప్రముఖ మహిళగా సినిమాల్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. కూతురు సుప్రితను హీరోయిన్‌గా లాంచ్ చేయాలని సురేఖ వాణి చాలా కాలంగా ఆలోచిస్తోంది.
సుప్రీతకు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నటి పరిశ్రమలోని బహుళ చిత్రనిర్మాతలతో మంచి పరిచయాలు కలిగి ఉంది.
చిత్ర పరిశ్రమలో సుప్రితకు మంచి లాంచ్‌ప్యాడ్ లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు జరుగుతున్నాయి మరియు ఆమె అరంగేట్రం గురించి అధికారిక నిర్ధారణ త్వరలో వస్తుంది.
ఇదిలా ఉండగా సుప్రిత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు మరియు ఫాలోవర్ లకు తన గురించి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు.
తన తల్లి లాగే తనకు కూడా ఆ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే తను సినిమాలలో నటించకున్న అంత ఫేమస్ అయ్యింది అంటే ఆమె సోషల్ మీడియా లో అంత ఆక్టివ్ గా ఉంటారని అర్ధం చేసుకోవచ్చు. తల్లి తో పాటు ఆమె ఎన్నో సినిమా పాటలకు స్టెప్స్ వేసి తన అకౌంట్ లో పోస్ట్ చేస్తుంటుంది.
అలా ఆమె డాన్స్ చేసిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యయో మనకు బాగా తెలుసు.ఒకరకంగా చెప్పాలంటే సినిమాలకు రాకముందే అభిమానులు ఉన్న అతి కొద్దిమంది లో సుప్రిత కూడా ఒకరు.
View this post on Instagram
కాబట్టి తనకు ఇంత మంది అభిమానులను తెచ్చిపెట్టిన సోషల్ మీడియా కు ఆమె ఎప్పుడు రుణపడి ఉంటారు.అందుకే ఆమె చాలా విషయాలను తన అభిమానులతో లేదా ఫాల్లోవేర్స్ తో లైవ్ లో మాట్లాడుతుంటారు.
తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆమె లైవ్ లో తన విషయాలను పంచుకుంటున్నప్పుడు కొంతమంది అమె ను కించపరిచే విధంగా కామెంట్స్ చేశారు.అందులో ఒకరిని లైవ్ నుండి తొలగించేసింది.
అయితే ఇంకొక వ్యక్తిని మాత్రం ‘నీకు ఇంగ్లీష్ లో కామెంట్స్ పెట్టడమే సరిగ్గా రావట్లేదు నువ్వు నన్ను అనడం తర్వాత ముందు వెళ్లి ఇంగ్లీష్ నేర్చుకో అంటూ’ చివాట్లు పెట్టారు.
అక్కడితో ఆగక ‘నిన్ను రోడ్డు పైన బట్టలు విప్పేసి నిలబెట్టాలి’ అని ఫైర్ అయ్యారు సుప్రిత. అయితే ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.