ఎన్నో బ్లాగ్బాస్టర్ సినిమాలకు నిర్మాత గా ఉండి టాలీవుడ్ లోనే అతి పద్ధ ప్రొడ్యూసర్ గా దగ్గుబాటి సురేష్ బాబు ఉంటూ వస్తున్నారు.అతని ప్రొడక్షన్ లో ఎన్నో ఎవర్ టైం హిట్ సినిమాలు ఉన్నాయ్.టాలీవుడ్ లో ది మోస్ట్ సక్సెఫుల్ నిర్మాత దగ్గుబాటి రానా తండ్రి గారైన సురేష్ బాబు అని చెప్పటం లో ఎటువంటి సందేహం లేదు.అయితే సురేష్ బాబు అతను వేసే ప్రతి అడుగు కి వార్తల్లోకి ఎక్కుతుంటాడు.అయితే తాజాగా అతను నిర్మించిన నారప్ప సినిమా ను అతను ఓటిటి లో విడుదల చేయడంతో టాలీవుడ్ లో ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు అతని పైనే ఉంది.
కాబట్టి అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ అనేక మీడియా సంస్థలు అతన్ని అనేక రకాలుగు ప్రశ్నిస్తున్నారు. చాలా విషయాలు అతని పర్సనల్ విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూ లో అతను మద్యం సేవించడం మరియు అతనికి అమ్మాయిలతో ఉన్న అఫైర్స్ గురించి ఓపెన్ అయ్యారు.

అయితే చిన్న నాటినుండి కూడా సినిమా వాతావరణం లోనే పెరిగిన సురేష్ బాబు తన తండ్రి బాటలోనే నడుస్తూ మరో బడా నిర్మాతగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా కొనసాగుతున్నాడు. అయితే మొదట్లో అతన్ని హీరోను చెయ్యాలని అతని తండ్రి ఎంతగానో కోరుకున్నాడట కానీ అతనికి ప్రొడక్షన్ పైనే ఆసక్తి ఉండడంతో నిర్మాతగానే ఉండాలని నిర్ణయించుకున్నాడని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అతను ఆఫ్ఫైర్లు మరియు మద్యం సేవించడం పై మాట్లాడినందుకు మరోసారి టాలీవుడ్ లో చర్చనియ్యంశంగా ఉన్నారు సురేష్ బాబు.
అయితే హీరోగా ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు ప్రొడక్షన్ పైన తానుకు చిన్నప్పటి నుంచే ఒక ఐడీ ఉందని కాబట్టి అలంటి ఆలోచనలు ఉన్నాయ్ కాబట్టే ఎన్నోసార్లు హీరో అవకాశాలు వచ్చిన కూడా తాను నటించడానికి ఒప్పుకోలేదని ఆయన అన్నారు.అయితే తన పిన్ని భర్తను చూసి జీవితంలో ఎప్పుడు తాగకూడదు అనే నిర్ణయం తీసుకున్నానని సురేష్ బాబు ఓపెన్ అయ్యారు. తన పిన్ని భర్త తాగడం మూలంగా ఆమె జీవితం నాశనం అయ్యింది.
కాబట్టి ఏది ఏమైనా సరే అతను ఎప్పటికి మద్యాన్ని ముట్టకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఎన్నో అవకాశాలు వచ్చిన కూడా అతను ఈ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోలేదని కూడా ఆయన అన్నారు. పెళ్లి అనేది జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది కాబట్టి తనను చేసుకోబోయే అమ్మాయికి అన్యాయం చేయకూడదని అలంటి వాటికి దూరం ఉన్నానని సురేష్ బాబు అన్నారు. ఒకవేళ మనం చేసుకోబోయే అమ్మాయి ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే చూసి తట్టుకునే శక్తి ఎవరికైనా ఉంటుందా అని ఆయన గుర్తుచేశారు.
ఇంకా ఈ ఇంటర్వ్యూ లో చాలా విషయాలపై అయన మాట్లాడి, తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు.