క్యాస్టింగ్ కౌచ్ అలవాటైపోయింది అంటున్న శ్వేతా వర్మ

Movie News

కోరిక తీరిస్తే రోజుకి లక్ష , కారు , ఇల్లు.. క్యాస్టింగ్ కౌచ్ అలవాటైపోయింది అంటున్న శ్వేతా వర్మ.

చిత్ర పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలకు నటన అభినయం అందం ఉన్నప్పటికీ కొంతమంది సినిమా ప్రముఖులు అమ్మాయిలను వేదిస్తూ ఉంటారు. అసలే అమ్మాయిలకు అవకాశాలు తక్కువ పైగా ఈలాంటి వేధింపులు ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ హీరోయిన్ శ్వేతా వర్మ యూట్యూబ్ లో ని ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పరిశ్రమలో కొంతమంది ప్రముఖులు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారంటూ తన జీవితంలో అనుభవించిన కొన్ని భయంకర వేధింపులను గురించి తెలియజేసింది.

శ్వేత వర్మ ఒక హీరోయిన్ అయ్యుండి బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో కంటెస్టెంట్ గా పోటీ పడింది. శ్వేతా వర్మ హీరోయిన్ గా సాధించలేని పేరు బిగ్ బాస్ ద్వారా సంపాదించుకుంది. ఇక ఆమె బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూకు హాజరు అయింది.

ఆ ఇంటర్వ్యూలో ఒక దాని వెంట ఒకటి శ్వేతా వర్మ చాకచక్యంగా సమాధానాలిస్తూ వచ్చింది. అయితే తన సినిమా ప్రయాణాన్ని గురించి వచ్చిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఎంతోమంది మనసును కలచివేసింది.

శ్వేతా వర్మ వెండితెర లో తనను తాను చూసుకుని మురిసిపోవాలని ఇండస్ట్రీకి వచ్చానని అయితే ఇక్కడికి వచ్చాక ఎన్నో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని వాటిని తట్టుకుని ఉంటేనే వెండి తెరపై కనిపించే గలరని తెలిసిందన్నారు ఆమె. పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఎంటర్ అయినప్పుడు అవకాశాలు కావాలంటే శారీరకంగా సుఖ పెట్టాలని ఎంతో మంది తనను వేధించారని ఆమె చెప్పుకొచ్చారు. కొంతమంది ఏకంగా లైంగిక వాంఛ తీరిస్తే లక్ష రూపాయలు మరియు కోరిన సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామని ఆశ చూపించారు అయితే నేను మాత్రం అడ్డదారుల్లో అవకాశాలు పొందడం ఇష్టపడలేదు అని చెప్పుకొచ్చింది.

మరి కొంతమంది తనను ఒక వేశ్య లాగా కోరిక తీరిస్తే ఇల్లు బంగ్లా కారు అప్పుడప్పుడు సినిమాల్లో అవకాశాలు ఇస్తామని ఆశ చూపించారని అన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్నాను అయితే తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లనే ఈ రోజు వరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని ఆమె అన్నారు.

అలాగే క్యాస్టింగ్ కౌచ్ అనే పెనుభూతం గురించి మాట్లాడుతూ నేను ఎన్నోసార్లు క్యాస్టింగ్ కౌచ్ గుండా వెళ్లాను ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ నాకు అలవాటైపోయింది అన్నారు.

ఇక శ్వేత వర్మ సినీ పరిశ్రమలో తనకు వచ్చే అవకాశాలు అతి తక్కువ అని గమనించి కొన్ని ప్రయోగాత్మకమైన మరియు మంచి సందేశాన్ని ఇచ్చే లఘు చిత్రాలలో బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో స్వేత వర్మ రాణి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కు నోచుకోలేదు ప్రస్తుతం ఆ సినిమాను ఓటీటి లో చూడొచ్చు. శ్వేతా వర్మ జీవితాన్ని దగ్గర నుండి గమనిస్తున్న చాలామంది అభిమానులు తన జీవితంలో ఏదో ఒక రోజు సరైన అవకాశం వస్తుంది అప్పుడు ఆమె కచ్చితంగా టాలీవుడ్ పరిశ్రమకు తానేంటో తెలియజేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *