tamanna-files-case-on-anasuya

ఆ షో నుండి తమన్నాను సడెన్ గా తప్పించిన జెమినీ టీవీ, అనసూయకి ఛాన్స్, లీగల్ నోటీస్ పంపిన తమన్నా భాటియా

Trending

ప్రస్తుతం తమన్నా చేతినిండా సినిమాలతో ఎన్నడూ లేనంత బిజీగా ఉంటున్నారు. అదే సమయములో పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు తమన్నా భాటియా. అంతేకాకుండా ఇటీవల చాలా ఘనంగా జెమినీ టీవీ వారు తమన్నా హోస్ట్ గా ఒక కుకింగ్ షో ఒకటి ప్లాన్ చేశారు. అయితే టీవీలో టెలికాస్ట్ మొదలు అయిన తర్వాత మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ కు టియార్పి రేటింగ్ బాగానే వచ్చినప్పటికీ చివరికి ఈ షో చప్పబడిపోయింది. ఆ తర్వాత అనూహ్యంగా టీయార్పీ తగ్గిపోవడంతో ఈ షో నిర్వాహకులు తమన్నాను తప్పించి, యాంకర్ అనసూయను తీసుకోవడం జరిగింది.

అయితే ముందే అగ్రిమెంట్ లో ఉన్నట్టుగా మద్యలో తనను తప్పించడం పట్ల తమన్నా భాటియా చాలా కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తమన్నా భాటియా ఇది తనకి జరిగిన ఒక అవమానంగా భావించడం జరిగింది.  అందువల్ల తమన్నా జెమినీ  టీవీ మేనేజ్ మెంట్ కి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఈ షో హోస్ట్ చేయడానికి గాను, అగ్రిమెంట్ లో పేర్కొన్న అమౌంట్ తనకి ఇచ్చి సెటిల్ చేయాలని ఆ లీగల్ నోటీస్ యొక్క సారాంశం. అయితే లీగల్ నోటీసులు అందుకున్న జెమినీ టీవీ యజమాన్యం తన ప్రతిస్పందనను ఇంకా తెలియజేయాల్సి ఉంది.

tamanna-files-case-on-anasuya

“శ్రీ” సినిమాతో తెలుగులో మంచు మనోజ్ తో కలిసి తెరంగేట్రం చేసిన తమన్నా భాటియా, ప్రస్తుతం తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉంటున్నారు. అయితే సినిమాలతో పాటు ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ సైతం చేస్తున్నారు. ఇంతకుముందే ఆహా లో రిలీజ్ అయిన “లెవెన్త్ అవర్” అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేశారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ జనాలని అంతగా ఆకట్టుకోలేదు. కానీ తమన్నా నిరాశ చెందకుండా ప్రస్తుతం ఇంకో వెబ్ సిరీస్ లో కూడా నటించారు. “నవంబర్ స్టోరీ” అనే వెబ్ సిరీస్ లో తమన్నా లీడ్ రోల్ చేశారు. ఓటీటీలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ వెబ్ సిరీస్ ను కోలీవుడ్ డైరెక్టర్ ఇంద్ర సుబ్రమణియం డైరెక్షన్ చేశారు.

తమన్నా,గోపీచంద్ జంటగా నటించిన “సీటీమార్” ఇటీవలే రిలీజ్ అయ్యింది, అలాగే నితిన్ తో కలిసి “మ్యాస్ట్రో” సినిమాలో ఒక విభిన్న పాత్ర చేశారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published.